దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన మూవీ ” నీ స్నేహం “. ఈ సినిమాను ఆడియన్స్ అంత సులువుగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాల్లో వచ్చే.. ‘ కొంతకాలం కిందట.. బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. ‘ అంటూ సాగే ఈ సాంగ్ అయితే ఎలాంటి క్రేజ్ పాపులారిటీ వచ్చిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఈ సాంగ్ వచ్చిందంటే చాలామంది దాన్ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాల్లో ఉన్న అన్ని సాంగ్స్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ సాంగ్స్ అయితే అప్పట్లో యూత్ కి హైలైట్‌గా నిలిచాయి.
ఇక 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బాస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటకి మంచి ఇమేజ్ కూడా దక్కింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా అందరికీ గుర్తుండిపోతాడు. ఇక ఆ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ జితిన్ గ్రేవాల్ నటించాడు. ఉదయ్ కిరణ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని స్నేహితుడు పాత్రలో జతిన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే నీ స్నేహం తర్వాత బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో మాత్రమే జతిన్ కనిపించాడు. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోని నటించని ఈయన.. ఉత్తరాఖండ్ పంజాబీ ఫ్యామిలీలో పుట్టాడు.
చండీగర్‌లో పెరిగిన జతిన్.. చదువు పూర్తయ్యాక మోడలింగ్ అడుగుపెట్టి రేమండ్స్, థమ్స్అప్, లేడీస్ సింగల్, ఇండిగోనేషన్, తాజ్ హోటల్స్ లాంటి ఎన్నో ప్రముఖ యాడ్‌లో నటించాడు. కొన్ని పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ మెరిసాడు. రాహుల్ అనే హిందీ సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జతిన్.. అనామిక, లవ్ యు సోనియా, షార్ట్ కట్ రోమియో, ఇంటర్నేషనల్ హీరో లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే 2016 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అదే ఏడాది కరోలీనా మాచి అనే అమ్మాయిని వివాహం చేసుకొని అమెరికాకు చెక్కేసాడు. అక్కడే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న జతిన్.. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నాడు. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. అప్పటికి.. ఇప్పటికీ.. అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ హ్యాండ్సం లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.