ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా.. ఇతని భార్య కూడా తెలుగులో ఓ స్టార్ బ్యూటీ..!

ఈ పైఫోటోలో క‌నిపిస్తున్న తెలుగు యాక్ట‌ర్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా. బుల్లితెర , వెండితెర అని తేడా లేకుండా ఎన్నో సినిమాలో న‌టించి మేపించిన ఈయ‌న దాదాపు 100 పైగా సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఇప్ప‌టికైనా గెస్ చేశారా.. అత‌నే టాలీవుడ్ నటుడు నవీన్ ఓలేటి. ఈ పేరు చెబితే వెంటనే వ్యక్తి గుర్తుకు రాకపోవచ్చు. అయితే ప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్.. అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తుంది. తొలివలపులో హీరో అన్నయ్యగా నటించిన ఈయన.. అదే విధంగా నువ్వే నువ్వే, ప్రేమించుకుందాం రా, విక్రమార్కుడు.. ఇలా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.

నిజానికి నవీన్ సినిమాల్లో కంటే బుల్లితెరపై తిరుగులేని క్రైజ్ సంపాదించుకున్నాడు. పద్మవ్యూహం, నాన్న లాంటి సీరియల్స్ లో నవీన్ కు భారీ పాపులాంటి దక్కింది. త‌ర్వాత‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు సపోర్టింగ్ రోల్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా హీరోలకు ఫ్రెండ్ గా నటించిన సినిమాలు ఎక్కువ. ఇక ఈ నవీన్ భార్య కూడా తెలుగు నటి కావడం విశేషం. ఆమె పేరే మ‌ధురిమ‌. ఆమె కూడా బుల్లితెరపై, వెండితెరపై తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది. ఆర్ నారాయణ మూర్తి డైరెక్షన్‌లో వచ్చిన ధళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

ప్రేమంటే ఇదేరా, తొలివలపు, ప్రేమతో రా, విక్రమార్కుడు, ఫ్యామిలీ సర్కస్, నరసింహనాయుడు లాంటి ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మరి ముఖ్యంగా విక్రమార్కుడు మూవీలో మధురిమ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల భార్యగా నటించింది. ఇక ఇదే సినిమాలో నవీన్ ఓలేటి కూడా పోలీస్ కానిస్టేబుల్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరమై అమెరికాలో లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి.