ఆ పనులన్నీ పూర్తి చేసుకుని జక్కన్న ప్రిషన్ లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న మహేష్..!

రాజమౌళి సినిమాలో నటించడం అంటే ఆ హీరోలకు ఆల్మోస్ట్ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టే. వాళ్లు చూడాలనుకున్నవి.. చేయాలనుకున్నవి చేసేసుకుని ఆ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తేనే తప్ప.. బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము అనడంలో సందేహం లేదు. ఇప్పుడు జక్క‌న‌ గురించి ఇంత బిల్డప్ అవసరమా అనే కదా మీ డౌట్.. కానీ అదే నిజమండి. మహేష్ బాబు కూడా ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నాడు. జ‌క్కన ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి రాకముందే.. చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం మహేష్ ఏం చేస్తున్నాడో.. అస‌లు మ్యాట‌ర్ ఏంటో ఒకసారి చూద్దాం.

Mahesh-Rajamouli Film: All Those Actors Are Just Rumours?

గుంటూరు కారం తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్స్ అయిన మహేష్.. ఫ్యాన్స్ కు ఆ సినిమాలో ఏం కావాలో గుర్తు పెట్టుకొని మరి వడ్డీతో సహా అందించేసాడు. డ్యాన్స్, డైలాగ్స్, పాటలు అలా ఏం చేసినా ఇప్పుడే అన్నట్లు గుంటూరు కారం సినిమాలో చూపించేసాడు. రాజమౌళి సినిమా తర్వాత అంతర్జాతీయమే అని ఫ్యూచర్ ను ముందే ఊహించిన మహేష్.. పాన్ ఇండియన్ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చిన కేవలం జక్కన్న తో సినిమా చేసేందుకు వెయిట్ చేశాడు. ఇక ఈ సినిమాతో చిన్నచిన్న హిట్లు కాదు.. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అన్నట్లుగా గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోబోతున్నాడు. ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని కలలు కంటున్నాడు. అయితే దానికి తగ్గట్లుగానే కష్టం కూడా ఉండాలిగా.. అందుకే జక్కన్న కోసం మూడేళ్లు ఆయనకు ఫిక్స్ చేశాడు.

Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమా.. మహేశ్‌ బాబు ఎనిమిది గెటప్స్ రెడీ! -  NTV Telugu

ఇకపోతే ఈ లోపు కొన్ని పనులు పూర్తి చేసేసుకుంటున్నాడు మహేష్. కాగా దాదాపు 2025 ఫస్ట్ హాఫ్‌లో మహేష్.. రాజమౌళి సినిమా సెట్స్ పైకి రానుందని టాక్. ఈలోపు సైన్ చేసిన కమర్షియల్ ప‌నులన్ని పూర్తి చేసేసుకుంటున్నాడు మహేష్. దీంతోపాటే ఫ్యాన్స్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట సూపర్ స్టార్. రాజమౌళి సినిమా సెట్స్‌ పైకి రాకముందే ఫ్యామిలీ టైం ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. హాలిడేస్ కు వెళ్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒకసారి రాజమౌళి మూవీ షూట్ మొదలైతే.. అందులోంచి బయటకు రావడం అసాధ్యం. పైగా మూడేళ్ల తర్వాత కానీ తన నుంచి సినిమా ఆడియన్స్ కు రాదు. అందుకే ఫ్యాన్స్ ని కలిసి సలహాలు సూచనలు తీసుకుంటున్నాడట ఈ అందగాడు. ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీతో జక్కన్న జైల్లోకి వెళ్ళకముందే.. బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసేస్తున్నాడు.