ఈ అమ్మ‌డు ఒకప్పుటి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిగర్.. గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో ఎలాగైనా న‌టిగా మారి మంచి సక్సెస్ తెచ్చుకోవాలని కసితో ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. వారిలో ఎంతోమంది లేడీస్ కూడా ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. సపోర్ట్ లేకుండా.. అడుగుపెట్టి మొదట పలు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా, కెమియో రోల్స్‌లో కూడా నటించిన తర్వాత.. పలు సినిమాల్లో కీలక పాత్రలో అవకాశాలు దక్కించుకొని స్టార్ సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పటికే మన ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది.. మొదట సినిమాల్లో పలు చిన్న చిన్న పాత్రలో నటించి మెప్పించారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో చూస్తున్న అమ్మడు కూడా ఒకటి.

ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. ఈమె హీరోయిన్ మౌని రాయ్‌. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కెరీర్ మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ లో అవకాశాలను దక్కించుకుంది. అయితే నాగిన్ సీరియల్ ద్వారా అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అభిషేక్ బచ్చన్, భూమిక చావ్లా నటించిన రామ్ సినిమా పాటల్లో మౌని రాయ్ మొదట డ్యాన్సర్‌గా పరిచయమైంది. అతి తక్కువ టైంలోనే ఫేమస్ అయినా ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.

నాగిని సీరియల్ ద్వారా యాక్తా కపూర్ షో క్యూంకి సాస్ బి కబీ బ‌హూ థీ లో కృష్ణ తులసి పాత్రను నటించి మెప్పించింది. అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాలో మౌని రాయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈ అమ్మడు.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగిన్ సీరియల్ తర్వాత కెరీర్‌లో వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న మౌని రాయ్‌.. ఇటీవల రిలీజ్ అయిన జలీమా పాటలో నటించి మెప్పించింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన బ్లాక్ శారీ పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. మీరు ఓ లుక్కేసేయండి.