యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్‌లతో నటించి మెప్పించాడు. కానీ ఒక హీరోయిన్ మాత్రం.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో స్పెషల్ బ్యూటీగా నిలిచిపోయింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు..? ఆమె ఎందుకు అంత స్పెషల్.. ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఆ హీరోయిన్ అంత స్పెషల్ గా మారడానికి కారణం తారకట్ ఆమెతో కలిసి మూడు సినిమాల్లో నటించగా.. మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకోవడమే.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చి మూడు అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన బృందావనం. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్, సమంత నటించారు. ఇక ఈ సినిమా అపట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తారక్ కాజల్ కాంబోలో తెరకెక్కిన మరో మూవీ టెంపర్. ఈ సినిమా కూడా ఆడియన్స్‌ను విపరితంగా ఆకట్టుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ భాద్‌షా. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోను ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఇలా కాజల్.. ఎన్టీఆర్ తో కలిసి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో కాజల్ చాలా స్పెషల్ హీరోయిన్ అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.