ఆ టాలీవుడ్ హీరో తండ్రి ఆఫర్ కావాలంటే కోరిక తీర్చాలన్నాడు.. షకీలా షాకింగ్ కామెంట్స్..!

ఇండియాలో ఒకప్పటి స్టార్ బ్యూటీ షకీలాకు ప‌రిచ‌యం అవసరం లేదు. శృంగార తారగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కుర్ర కారు నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. షకీలా పేరు తెలియని వారే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ అమ్ముడుసు పరిచితమే. అంతలా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.. ఈ బొద్దుగుమ్మ. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఉంటుందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా దాదాపు అన్నిచోట్ల కాస్టింగ్ కౌచ్ సమస్యలను చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. ఇలా ఇప్పటికే క్యాస్టింగ్ కోచ్ సంగతులు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా ఎదిగిన వారి నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్క నటి ఏదో ఒక సమయంలో.. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

అందుకే సినిమాల్లో అడుగు పెట్టాలంటే చాలామంది అమ్మాయిలు.. నటనపై ఆసక్తి ఉన్న వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పేరు మరింతగా వినిపిస్తుంది. అందులోను హేమ కమిటీ నివేదిక రిలీజ్ చేసిన తర్వాత మరింత మంది సీనియర్ హీరోయిన్లు కూడా వారి ఇబ్బంది పడే సందర్భాలను వివరిస్తున్నారు. కాగా షకీలా కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవల కొన్ని షాకింగ్ విషయాలను రివిల్ చేసింది. తన కెరీర్లో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆమె రూమ్ కి పిలిచాడంటూ షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో తండ్రి ఎవరో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. కామెడీ సినిమాలతో హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అల్లరి నరేష్.

ఇక అల్లరి నరేష్ తండ్రీ సత్యనారాయణ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే సత్యనారాయణ గతంలో షకీలాని రూమ్ కి రమ్మని అందరి ముందే పిలిచాడంటూ.. షకీలా వివరించింది. తన కోరిక తీరిస్తే తన తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని.. అతను అన్నాడని చెప్పుకొచ్చింది. అయితే ఆఫర్‌ను షకీలా రిజెక్ట్ చేసిందట. తర్వాత అతనితో ఒక్క సినిమా కూడా చేయలేదని.. అయితే ప్రస్తుతం సత్యనారాయణ లేరు కానీ.. ఇది నిజమని ఆమె వివరించింది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వల్ల చాలామంది నటీమణులు వాళ్ళ లైఫ్ లో జరిగిన సంఘటనలు, లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. ఇన్ని రోజులు చెప్పని వాళ్ళు కూడా ఇప్పటికీ బయటకి వస్తున్నారు. ధైర్యంగా అందరి ముందు పేర్లతో సహా బయట పెడుతున్నారు.

ఈ క్రమంలోనే తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని షకీలా వివరించింది. సొంత తల్లి తనని స్వయంగా వ్యభిచార కూపంలోకి నెట్టిందని.. ఎన్నోసార్లు ఈ సంఘటనపై బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. డబ్బుల కోసం తనని ఒక్క మనీ మెషిన్ల వాడిందని.. చాలామంది దగ్గరకు పంపించిందంటూ వివరించింది. ఇలా తన ఇంట్లో వాళ్ళ చేత మోసపోయిన షకీలాను చివరికి తన సోదరుడు కూడా మోసం చేశాడట. వాళ్ళు తన డబ్బులన్నీ తీసుకుని ఇంటి నుంచి గెంటేసారని.. ఆమె ఎన్నో ఇంటర్వ్యూలో వివరించింది. అయితే ప్రస్తుతం షకీలా.. అల్లరి నరేష్ నాన్న‌ గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.