ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి రెండు నెలలు టాలీవుడ్ పెద్ద సినిమాల పండగ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తలపడి సక్సెస్ కూడా అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా మన సీనియర్ స్టార్ హీరోలంతా రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. థియేటర్లన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లానున్నాయి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సినిమాలు రిలీజ్ అయినా.. డిసెంబర్ జనవరి నెల కు మాత్రం భారీ పాన్ ఇండియా సినిమాలను ఆడియన్స్ చూడబోతున్నారు. డిసెంబర్లో బన్నీ పుష్పా 2 సినిమా రానున్న సంగతి ఇప్పటికే తెలుసు.
ఒకరోజు ముందుగా ప్రీమియర్లతో థియేటర్ల వద్ద సందడి మొదలైపోతుంది. అలాగే రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా రెండు వారాల గ్యాప్ తో డిసెంబర్లోనే ఆడియన్స్ను పలకరించింది. అయితే ఈ రెండు సినిమాల సందడి పూర్తికాకముందే.. రెండు వారాల గ్యాప్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోతుంది. ముగ్గురు సీనియర్ హీరోలు ఈసారి సంక్రాంతి బరిలో తలపడనున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా భారీ బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాతో మెగాస్టార్ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ఇక బాలకృష్ణ – బాబి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక వెంకటేశ్ – అనిల్ రావిపూడి – దిల్ రాజు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లెంగ్తీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. సంక్రాంతి లోపు ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఎప్పుడు సంక్రాంతి సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే నాగార్జున మాత్రం ఈసారి సంక్రాంతికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కనీసం ఏ సినిమా షూట్ లో కూడా పాల్గొనడం లేదు. కాంబినేషన్ సినిమాలు తప్ప.. సోలో సినిమా లేదు. ఒక నాగ్ సంక్రాంతి బారిలో వచ్చే అవకాశాలు లేవు.
ఈ క్రమంలో ఈసారి బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ మధ్యన గట్టి పోటీ జరగనుంది. ఇక నాగ్ తన ఫ్యామిలీ సెంటిమెంట్ వర్క్ చేయాలనుకుంటే మాత్రం.. చైతన్య నుంచి తండేల్ సినిమా సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో యువి, గీతా, దిల్ రాజు, సితార సంస్థలు ఒకేసారి తమ సినిమాలతో పోటీకి దిగుతాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి పోటీగా.. గీత ఆర్ట్స్ సినిమాను దింపే అవకాశాలు ఉండవని చెప్పవచ్చు. ఏది ఏమైనా.. మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్ మాత్రం సంక్రాంతి బరిలో తలపడడం పక్కా. ఇక ఈ వార్లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.