ఈ బుల్లి గౌను చిన్న‌ది ప్రభాస్ బ్యూటీ.. ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తల్లి పక్కన పొట్టి గౌన్ వేసుకుని క్యూట్ గా కూర్చున్న ఓ బొజ్జయి ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ. అందం, గ్లామర్ తో నెటింట‌ రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ.. సరైన బ్రేక్ కోసం తెగ కష్టపడిపోతుంది. నేషనల్ వేదికలపై కూడా మెరిసిన ఈ బ్యూటీ.. నటనపై ఆసక్తితో మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది. ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆర్మీ ఫ్యామిలీలో పుట్టిన ఈ చిన్నది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తుంది.

తెలుగు, మలయాళం, మరాఠీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. తనే యంగ్ బ్యూటీ రిద్ది కుమార్. ఈమె తండ్రి వివేక్ కుమార్ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా పని చేయడంతో.. పూఫ‌ణే, బెంగళూరు ప్రాంతంలోనే ఈ అమ్మడు చదువు కంప్లీట్ చేసుకుంది. ఫిలాసఫీలో డిగ్రీ కంప్లీట్ చేసిన రిద్ది.. చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఆసక్తితో మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి రాణించింది. యాంకరింగ్ కూడా చేసింది. ఈవెంట్‌ మేనేజ్మెంట్ కంపెనీలోను పనిచేసింది.

తర్వాత నెమ్మదిగా అందాల పోటీల్లో సందడి చేసింది. 2014లో ఆర్ఎస్ఐ మే క్వీన్.. పోటీలో పాల్గొని విన్నర్ గా నిలిచింది. తర్వాత 2015లో పూణేలో నిర్వహించిన మరో పోటీలో విజయాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో సక్సెస్ అందుకుంది. బుల్లితెరపై ఎన్నో ఆడ్స్ లో కనిపించింది. ఈ క్రమంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ స‌ర‌సన లవర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమా సక్సెస్ కాకపోయినా నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత అనగన‌గా ఓ ప్రేమ కథ సినిమాలోని నటించింది.

తర్వాత మలయాళం, మరాఠీ భాషలో అవ‌కాశాలు దక్కించుకొని అక్కడికి షిఫ్ట్ అయింది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాదేశ్యామ్‌ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన రిద్ది.. ఓ పక్కన హిందీ సినిమాలో.. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి ప్రభాస్ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ క్రమంలో రిద్ది కుమార్ చిన్ననాటి ఫొటోస్ తో పాటు లేటెస్ట్ గ్లామర్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.