యూఎస్ మార్కెట్ లో దుమ్ము రేపుతున్న నాని ‘ సరిపోదా శనివారం ‘.. కలెక్షన్స్ ఇవే..!

ఐకాన్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో జరిగే కింది మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక గతంలోనే వివేక్ ఆత్రేయ.. నాని కాంబోలో గ‌తంలో అంటే సుందరానికి సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో.. రిలీజ్ కు ముందే మంచి అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఈ క్రమంలో సినిమా రిలీజై పాజిటీవ్‌ టాక్ తెచ్చుకుంటే.. సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అంటూ ట్రేడ్ వ‌ర్గాలు విల్ల‌డించాయి. అయితే ట్రేడ్ వర్గాలు వెల్లడించినట్లే సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. సాలిడ్ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఇక్కడే కాదు.. యూఎస్ మార్కెట్‌లోనూ శివతాండవం ఆడేస్తోంది. లేటెస్ట్గా సినిమా అక్కడే రూ.7.50 లక్షల డాలర్ గ్రాస్ వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టి సంచలనంగా మారింది. దీంతో నాని కెరీర్‌లో మరో వన్ మిలియన్ డాలర్ సినిమా పడుతుందన‌టంలో సందేహం లేదంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక‌ ఇప్పటికే హాయ్ నాన్న దసరా సినిమాలతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్న నాని.. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ అందుకున్నాడంటూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాకు జేక్స్ బిజిఎం సంగీతం అందించగా..డివివి ఎంట్ర్‌టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. అంతేకాదు.. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయ్యారంటూ.. హిందీ డిజిటల్ రైట్స్.. జియో ఓటిటి సొంతం చేసుకుందని.. అలాగే నెట్‌ఫ్లిక్స్ కూడా భారీ ధరకు రైట్స్ కొనుగోలు చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే సినిమా నెట్‌ఫ్లిక్స్, జియోలో ఒకేరోజు స్ట్రీమింగ్ కానుందట. సెప్టెంబర్ 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుందని సమాచారం.