పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గమనించారా.. చాలా చాలా రేర్.. !

పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గురించి ప్ర‌స్తుతం నెటింట ఇంట్ర‌స్టింగ్ చ‌ర్చ న‌డుస్తుంది. ఓ విషయంలో ఈ ఇద్ద‌రు స్టార్‌లు సేమ్ టు సేమ్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ వివరిస్తున్నారు. సినిమాలో స్టార్టింగ్ విషయంలోనూ ఇద్దరు సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారని.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా.. ఓజి ముందు స్టార్ట్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్‌తో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సమానంగా అంతే ఆసక్తి రేపుతున్న మరో ప్రశ్న పవన్ సినిమాలో షూట్ హైదరాబాద్‌లోనా..? లేదా..? విజయవాడలో ఉంటుందా.

ఇక్కడ ఆల్రెడీ వేసిన సెట్స్‌లో జరుపుతారా..? లేదా అక్కడ మరోసారి సెట్స్ ఏర్పాటు చేసి.. అక్కడ షూటింగ్ జరుపుతారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. నిన్నటిదాకా సెల్ఫ్ గా జరిగిన డిస్కషన్స్.. ఇప్పుడు మహేష్ సినిమాతో ముడిపెడుతూ ట్రెండ్ చేస్తున్నారు పవన్ హార్ట్ కోర్ ఫ్యాన్స్. పవర్ స్టార్ కి, సూపర్ స్టార్ కి మధ్య ఉన్న రేర్ క్వాలిటీ, వండర్ఫుల్ క్వాలిటీ ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇద్దరు ఒకే రకంగా బిహేవ్ చేస్తున్న తీరు గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా సినిమా మేకర్స్‌ని కలిసిన పవన్ కళ్యాణ్.. ఆ పిక్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

అటు మహేష్ కూడా రాజమౌళితో.. తన సినిమా అప్డేట్ లేకపోవడంతో మోఫాసా ట్రైలర్ ని షేర్ చేసాడు. ఇలా చేయాల్సిన సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్న.. ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు త‌మ‌కు సంభందించిన ఇలాంటి అస్డేట్స్‌ షేర్ చేసుకుంటూ మా హీరోలు అదర్స్ అనిపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీలో బిజీగా ఉంటే.. మహేష్ మేకవర్లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇద్దరు చేయాల్సిన సినిమాలు కళ్ళముందే ఉన్న.. ముందుకు కదలక పోవడంతో ఏవో అప్డేట్ ఫ్యాన్స్‌కు ఇస్తూనే ఉన్నారు. ఇక పవన్ సినిమాల విషయంలో సిగ్నల్ ఆయనే ఇవ్వాల్సి ఉంది. ఇక మహేష్ సినిమా ముందుకు కదలాలంటే జక్కన్న కమాన్ అనాల్సిందే అదొక్కటే తేడా తప్పించి.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. అంటూ అభిమానులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.