సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న వారికి ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అలా గత కొద్ది కాలంగా స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ పై ఫోటోలో అమాయకంగా చూస్తున్న చిన్నదాని ఫోటో నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ హాట్ బ్యూటీ. ఇండస్ట్రీలో మొదటి సినిమానే బోర్డర్స్ చెరిపేసి బోల్డ్ నటనతో ఆకట్టుకుంది.
లక్షలాదిమంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లోనే కత్తిలాంటి ఫిగర్. ఈ అమ్మడికి ఎలాంటి మగాడైన టెంప్ట్ అవ్వక తప్పదనేంతలా గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. అది కొంచెం కష్టం లేండి.. మేమే చెప్పేస్తాం. ఆమె ఎవరో కాదు పాయల్ రాజ్‌పుత్. మొదట హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ.. ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో అమ్మడు పలు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే తర్వాత ఈమె కొన్ని సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. ఫస్ట్ సినిమానే బోల్డ్ గా నటించడంతో అమ్మడికి తర్వాత డీసెంట్ సినిమాల్లో అవకాశం వచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించలేదు. ఈ క్రమంలో అమ్మడికి వరుస ఫ్లాప్‌లు ఏర్పడ్డాయి. ఇక కొంత కాలం తర్వాత వచ్చిన మంగళవారం సినిమాతో మరోసారి తన బోల్డ్ నటునతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో తను నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. టాలెంటెడ్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కానీ.. అమ్మడి బ్యాడ్ లక్ ఏంటంటే కేవలం ఈమె బోల్డ్‌గా నటించిన సినిమాలు మాత్రమే హిట్.. మిగతావన్నీ ప్లాప్లుగా నిలుస్తున్నాయి. దీంతో అమ్మడికి కేవలం బోల్డ్, గ్లామర్ షోకు తావున్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. డీసెంట్ రోల్స్ ఇచ్చి నటింపచేయడానికి ఏ డైరెక్టర్ కూడా ఆసక్తి చూపడం లేదు.