టాలివుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అభిమానులకు ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి. వారు నటించింది.. ఒకటి, రెండు సినిమాలు అయినా.. ఆ కాంబోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా టాలీవుడ్ లో నయన్ – తారక్ కాంబోకు కూడా మంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి అదుర్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు.
అయితే నయన్ – తారక్ కాంబోలో ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్స్ మిస్ అయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. అసలు వీరిద్దరికి అంబాలో రావాల్సిన ఆ బ్లాక్ బస్టర్ మిస్ అవ్వడానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. ఈ సినిమా ఏదో కాదు.. జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాల్లో సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. కాగా మూవీలో నిత్యమీనన్ పాత్ర కోసం మొదట నయనతారను భావించారట. దీని కోసం నయనతారను అప్రోచ్ కాగా.. స్టోరీ విన్న నయన్ తన పాత్ర నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక ప్రస్తుతం నెటింట వైరల్ గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయమంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.