ఒకప్పుడు తన క్రేజ్ తో సౌత్ లో ఒక ఊపు ఊపిన కాజల్ అగర్వాల్ కొడుకు పుట్టాక కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలా బాలయ్యతో భగవంత్ కేసరి, భారతీయుడు 2 లో కమల్ హాసన్ సరసన నటించింది.అలాగే సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి ఓ స్టార్ ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్ ఇచ్చి హాట్ గా నటించి మరింత స్కిన్ షో చేయమని చెప్పారట.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కాజల్ అప్పటివరకు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ కూడా చేస్తున్నారని వారి బాటలోనే ఈమె కూడా జనతా గ్యారేజ్ మూవీలో నేను పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ సరసన మెరిసింది.అయితే ఈ పాటలో కాజల్ అగర్వాల్ డాన్స్ కి గ్లామర్ కి ఫిదా అయినా ఓ తమిళ ప్రొడ్యూసర్ ఆమె దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు రాబోయే నా నెక్స్ట్ సినిమాలో మరింత స్కిన్ షో చేసి మరింత హాట్ గా గ్లామర్ గా నటించమని చెప్పారట.
కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదట. అలాగే జనతా గ్యారేజ్ మూవీలో పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ లో చేయడానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నేను ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేశాను. కానీ అన్ని అలాంటి పాత్రలే చేస్తాను అని చెప్పడం లేదు. కేవలం ఆ సినిమాలో ఎన్టీఆర్ కోసమే స్పెషల్ సాంగ్ చేశాను.. మీరు చెప్పే పాత్రల్లో నటించడం నావల్ల కాదు. అన్ని అలాంటి పాత్రలే చేస్తే నాకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావు.మంచి మంచి సినిమాలు మిస్ అవుతాను. నేను అందులో నటించను అని ఆ తమిళ ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పిందట కాజల్ అగర్వాల్.