నిక్కీ గల్రానీని ఆ హీరో నిజంగానే టార్చర్ చేశారా.?

హీరో నిక్కి గల్రాని ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంటుంది. కానీ ఈ హీరోయిన్ కి మాత్రం కాస్త కూస్తో ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ మాత్రం ఉంది. ఆది పినిశెట్టి ని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ప్రెగ్నెన్సీ రూమర్స్ ని ఎదుర్కొంటుంది. అయితే రీసెంట్ గా ఈమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో చాలామంది ప్రెగ్నెంట్ అన్నారు. దాంతో అందరికీ వార్నింగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పింది. అయితే అలాంటి నిక్కీ గల్రాని ఓ హీరో వేధించాడని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

నిక్కీ గల్రానీ - వికీపీడియా

నిక్కీ గల్రాని తెలుగులో సునీల్ నటించిన కృష్ణాష్టమి, తమిళ్ డబ్ మూవీ మలుపు, మరకతమణి వంటి సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో నటించినవి తక్కువే అయినప్పటికీ తెలుగు అభిమానులను మాత్రం సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ నటుడు జీవాతో ఓ సినిమాలో నటించే సమయంలో ఆయన నన్ను టార్చర్ చేశారు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ పెట్టాక సినీ ఇండస్ట్రీ నుండి ఆమెకు వ్యతిరేకత ఏర్పడడంతో పోస్ట్ పెట్టిన కొద్ది గంటలకే ఆ ట్వీట్ డిలీట్ చేసి మళ్ళీ ఆ పోస్టు నేను చేయలేదని, నా సోషల్ మీడియా ఖాతాని ఎవరో హ్యాక్ చేసి దాన్ని పోస్ట్ చేశారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయం సుందర్ సీ దర్శకత్వంలో వచ్చిన కల్లగల్లుపు -2 సినిమా సమయంలో బయట పడింది..

Jiiva - Wikipedia

కానీ ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి నిక్కీ కి ఇండస్ట్రీ లో వ్యతిరేకత ఏర్పడడంతో నిక్కీ,జీవా ఇంటికి వెళ్లి మరీ ఆ పోస్ట్ నేను చేయలేదు అని బ్రతిమిలాడినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక అప్పటికే జీవా మీద నెగిటివ్ రూమర్స్ వైరల్ అయ్యేసరికి ఇందులో ఎలాంటి నిజం లేదు అని నిక్కీ గల్రాని తప్పుడు ఆరోపణలు చేసింది అని తన అభిమానులకు తెలియజేయడానికి మళ్లీ నిక్కీ గల్రానితో కీ అనే మూవీలో నటించారు. కానీ ఈ సినిమా అనుకున్నంత హిట్ అయితే కాలేదు. అలా నిక్కీ గల్రాని నటుడు జీవా టార్చర్ చేశాడని స్వయంగా చెప్పి ఆ తర్వాత నేను ఆ ట్వీట్ చేయలేదని తప్పించుకుంది. ఇక అప్పట్లో ఈ మ్యాటర్ కోలీవుడ్ లో సెన్సేషనల్ అయ్యింది.