టాలీవుడ్ లో హీరోలు… దర్శకులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అంతా తమకే తెలుసు తాము చెప్పినట్టే చేయాలని బిల్డప్పులు ఇస్తూ ఉంటారు. డైరెక్షన్లో వేలుపెట్టి చాలా సినిమాలు ప్లాప్ అవ్వటానికి హీరోలు కారణం. తాజాగా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఒకతను ఉన్నాడు. తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో రెండవ సినిమాకే స్టార్ హీరోతో పని చేసే అవకాశం తెక్కించుకున్నాడు. ప్రాజెక్టు కూడా ఆన్ అయింది.. అయితే అక్కడ నుంచి దర్శకుడికి కష్టాలు మొదలయ్యాయి.
ఆ హీరోకి కథ చెప్పి ఒప్పించడం బాగానే జరిగింది.. ఆ తర్వాత హీరో గారు స్క్రిప్టులో రంగ ప్రవేశం చేశారట. అక్కడ నుంచి మార్పులు.. చేర్పులు చేయాలని కండిషన్లు పెట్టారట.. పైగా హీరోగారు సీనియర్ కావడంతో ఆ దర్శకుడు అందుకు ఒప్పుకున్నాడు.. అదే సినిమాకు ఓ స్టార్ కెమెరామెన్ తీసుకువచ్చారు.. అది కూడా హీరో గారి రికమండేషన్.. దీంతో ఆ హీరో గారు ఆ కెమెరామెన్ ఇద్దరూ కలిసి దర్శకుడికి సలహాలు.. సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో కెమెరామెన్ చాలా సీన్లను తాను చెప్పినట్టు చేయాలని చెబుతున్నారట. పైగా హీరోగారి సపోర్ట్ కూడా ఉంది.. దీంతో దర్శకుడు పూర్తి డమ్మీ అయిపోయారు.
చివరకు దర్శనం పక్కనపెట్టి ఆ కెమెరామెన్ తీసుకొచ్చి డైరెక్షన్ సీట్ లో కూర్చో పెట్టారట. ఇప్పుడు ఆ సినిమాకు డైరెక్టర్ సెట్ లో ఉంటున్నాడు.. అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డమ్మీలు.. హీరో కెమెరామెన్ ఒక్కటయి వాళ్ళిద్దరే సినిమా తీసుకుంటున్నారట. చివరికి ఆ డైరెక్టర్ పరిస్థితి ఎలా తయారైందంటే ? ఓ పెద్ద హీరో సినిమాకి పని చేస్తున్నానన్న తృప్తి కూడా లేకుండా పోయిందట. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక అసిస్టెంట్ల మీద తన కోపం చూపిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.