బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అందరి హీరోలతో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, సీనియర్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా ఆమె ఆయనతో సినిమా చేయలేదు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Nandamuri Balakrishna HD wallpaper

1970లో వచ్చిన మా నాన్న నిర్దోషి అనే సినిమాలో బాలనటిగా కనిపించి అలరించిన ఈమె..1978లో పదహారేళ్ళ వయసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాలలో చేసింది.మరోవైపు బాలకృష్ణ 1974లో బాలనటులుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తాతమ్మ కళా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మంగమ్మగారి మనవడు , భలే దొంగ, రామ్ రహీం ఇలా ఎన్నో సినిమాలలో ఆయన యుక్తవయసులో కనిపించి ఆకట్టుకున్నారు.

అదే సమయంలో శ్రీదేవి.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి పెద్ద హీరోల సరసన నటించినా.. బాలయ్యతో సినిమా చేయలేదు. దీనికి కారణం ఏంటి అంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1987లో శ్రీదేవి, బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా జరిగింది. సినిమా పేరు సామ్రాట్.మరోవైపు 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమా తీసుకురావాలనుకున్నారు.

Pin on Star Celebrity Sketches

అందులో హీరోయిన్గా శ్రీదేవిని పెట్టాలనుకున్నారు . మరోవైపు శ్రీదేవి తన సినిమా డేట్లతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో చేయడానికి బాలకృష్ణ ఒప్పుకునా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. ఈ కారణంగానే ఆ రెండు చిత్రాలలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఇకపోతే శ్రీదేవి నటించిన కొంటె కృష్ణుడు, రౌడీ రాముడు, అనురాగ దేవత వంటి చిత్రాలలో వీరిద్దరూ ఒకే ప్రేమలో కనిపించారు. కానీ బాలకృష్ణ – శ్రీదేవి జంటగా కనిపించలేదు.