మరోసారి టాలీవుడ్ లో రీ రిలీజ్ లు ఊపందుకున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రిన్స్ మహేస్‌బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఏకంగా రు. 10 కోట్లకు మించిన వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇంద్ర కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఇంద్ర సినిమా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ చేసి మళ్ళీ అప్పటి సత్తా ఇపుడు కూడా చూపించింది.
22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయినా కూడా ఇంద్ర సినిమా స్టామినా.. చిరు క్రేజ్ తెలుగు నాట ఏ మాత్రం తగ్గలేదు అన్నట్టుగానే ఆ సినిమాకు వసూళ్లు వచ్చాయి. ఇక తర్వాత వస్తోన్న రీ రిలీజ్ సినిమాల్లో బిగ్గీ రీ రిలీజ్ ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్. బండ్ల గణేష్ నిర్మాతగా… దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించడంతో పాటు ఇండస్ట్రీని ఊపేసింది.
ఇక పవన్ బర్త్ డే కానుకగా గబ్బర్‌సింగ్ మరోసారి రీ రిలీజ్ అవుతోంది. పైగా ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.. జనసేన అధికార పార్టీ. దీంతో గబ్బర్‌సింగ్ రీ రిలీజ్‌లో రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి మాత్రం యూఎస్ మార్కెట్ లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇంద్ర సినిమానే సుమారు 70 వేల డాలర్స్ మేర గ్రాస్ అందుకుంది. అలాంటిది గబ్బర్ సింగ్ సునాయాసంగా లక్ష డాలర్స్ మార్క్ నుంచి లెక్క మొదలు పెడుతుంది ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మరి గబ్బర్‌సింగ్ మానియా తెలుగు నాట ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ 2 వరకు ఆగి చూస్తే తెలుస్తుంది.