టాలీవుడ్‌కు నయా సోయగాలు.. నందమూరి వారసుల కోసం ఇద్దరు కొత్త బ్యూటీలు..

కొత్త అందాలను ప్రేక్షకులకు చూపించడానికి.. లేక సోయగాలను స్వాగతించడానికి.. ఎప్పుడూ టాలీవుడ్ ముందు వరుసలా ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది నార్త్ లేదా కోలీవుడ్, శాండిల్‌వుడ్‌, బాలీవుడ్ నుంచి ఎంతోమంది కొత్త హీరోయిన్ల తెలుగు తెరపై సందడి చేస్తూ ఉంటారు. అలా త్వరలోనే తెలుగులో ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయం కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నందమూరి వారసుల కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనన్నారట. ఇంతకీ వారు ఎవరో ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం నందమూరి వారసులుగా.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనన్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఈ సినిమా ఫిక్స్ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సెప్టెంబర్‌లో రానుందని టాక్. ఇందులో మోక్షజ్ఞ సరసన‌ కొత్త బామ్మ కనిపించనుందట. అలానే నందమూరి ఫ్యామిలీ నుంచి రానున్న మరో హీరో జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్.. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఎలమంచిలి జీవిత ప్రొడ్యూసర్‌గా తెర‌కెక్కుతున్న‌ సినిమాలో తెలుగు అమ్మాయి వీణ రావు హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడితో దీపిక పదుకొనే తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ భామ మాళవిక మోహన్ ఎంట్రీ.. ఇక ప్రభాస్ – హాను రాఘవపూడి ఫౌజీ సినిమా కోసం మరో కొత్త సోయ‌గం ఇమాన్వీ ఇస్మాయిల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బ్యూటీ పౌజీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉంటారు మేకర్స్.