ఇంద్ర సీన్ రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసిన కేటుగాళ్లు.. పరిపూర్ణ ఆరోగ్యం అంటూ.. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఇటీవల రీ రిలీజై ఎలాంటి రికార్డ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంద్ర‌ సినిమాల్లో చిరంజీవి మాస్ నటనతో పాటు.. కాశీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం నీది తెనాలే.. నాది తెనాలే అంటూ వచ్చే డైలాగ్.. ఓ కుటుంబాన్ని మోసం చేసే విధానం.. ప్రేక్షకులను ఫుల్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. బంగారం డబల్ అవుతుంది అంటూ పూజలు చేపించి.. మొత్తం దోచేస్తారు బ్రహ్మానందం టీం. అయితే అది సినిమా కాబట్టి ప్రేక్షకులకు నవ్వులు పూయించింది.

కానీ.. ఇలాంటి సంఘటన రియల్ లైఫ్ లో జరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి మోసానికి పాల్పడ్డారు ఇద్ద‌రు కేటుగాళ్ళు. ఆరోగ్యం బాగు చేస్తామంటూ పూజలు చేయించి.. బంగారం మొత్తాన్ని స్వాహా చేశారు. ఈనెల 21న ఐరాల మండలం నాగంవాండ్లప‌ల్లెలో యశోద అనే మహిళా ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకున్న ఈ కేటుగాళ్లు.. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పూజలు చేయించాలంటూ నమ్మించి పూజల భాగంగా ఇంట్లో బంగారాన్ని అక్కడ పెట్టాలంటూ ఆదేశించారు. దీంతో వారి మాటలు గుడ్డిగా నమ్మిన ఆ అమ్మాయి తన వద్ద ఉన్న 26 గ్రాముల బంగారాన్ని పెట్టిలో పెట్టి.. పూజలో కూర్చుంది.

Indra - ఇంద్ర Telugu Full Movie | Chiranjeevi | Arthi Agarwal | Sonali  bendre | Telugu Movie studio - YouTube

ఇక పూజ ముగిసిందని కర్పూరం ఆరేంతవరకు కళ్ళు తెర‌వొద్దంటూ వారు చెప్పడంతో యశోద అలాగే కళ్ళు మూసుకుని ఉంది. చివరకు కళ్ళు తెరిచి చూసేసరికి పెట్టెలో బంగారంతో ఆ కేటుగాళ్ళు ఇద్దరు మాయమయ్యారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ప్రజల నమ్మకాలను విడిచి పెట్టాలి. మాయ మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా డయల్ 100,112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్.. 944090005కు సమాచారం అందించాలని ఆ ఏరియా ఎస్పీ మణికంఠ ప్రజలకు సూచించారు.