ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ సినిమాలో నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా తమిళ్, మలయాళ, బాలీవుడ్ లోను రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అయితే ఈ ట్రైండ్ ఇప్పటిది కాదు.. చిరంజీవి 1992లో స్టార్ట్ చేశాడు. బాలీవుడ్‌తో పాటు.. కన్నడ, తమిళ భాషల్లోనూ తెలుగు సినిమాలను నటించి మెప్పించాడు. అలా బాలీవుడ్ లో హీరోగా చిరంజీవి నటించిన మూడు సినిమాలు తెలుగు సినిమాల రీమేక్ కథలే కావడం విశేషం. ఇక ఆ సినిమాలు ఏవి.. వాటి రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
మొదట మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్‌లో.. టాలీవుడ్‌లో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాను ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేసి నటించారు. ఈ సినిమాకు రవిరాజా పిన్నిశెట్టి దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి సక్సస్ అందుకుంది
తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్ళీ ఆయనే హిందీలో ఆజ్ కా గూంఢారాజ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్ మాన్ చిరంజీవి బాలీవుడ్‌లో ది జెంటిల్మెన్ పేరుతో తెరకెక్కించాడు. తమిళ్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు అక్కడ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేయగా.. అక్కడ ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్‌తో పాటు చిరంజీవి తమిళంలో 47 డేస్ నాట్కల్‌తో పాటు.. మరో మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. ఇక కన్నడలో సిపాయి, శ్రీ మంజునాథ సినిమాలతో ఆకట్టుకున్నాడు.