నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలో లక్షలాదిమంది అభిమానులతో పాటు టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయనకు గ్రాండ్ లెవెల్ లో విషెస్ తెలియజేశారు. మెగా ఫ్యామిలీ అయితే మెగాస్టార్ తో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ వారితో కలిసి దిగిన ఫోటోలను వారితో ఉన్న స్వీట్ మెమరీస్ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇలాంటి క్రమంలో చిరంజీవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెటింట వైరల్‌గా మారింది. మెగాస్టార్ అంత పెద్ద స్టార్ హీరోను తన తండ్రి కొణిదెల వెంకటరావు.. థియేటర్ దగ్గర నుంచి రోడ్డుపై పరిగెత్తించుకుంటూ కొట్టారట. అసలు చిరంజీవిని తండ్రి అంతలా కొట్టడానికి కారణం ఏంటి.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో.. ఒకసారి తెలుసుకుందాం.
చిరంజీవి తన 13 ఏళ్ల వయసులో తమ్ముడు నాగబాబును తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాము మూవీ కి వెళ్లారట. కాగా సినిమా అదే ఫస్ట్ రోజు రిలీజ్ కావడంతో థియేటర్ దగ్గర జనాలలో పెద్ద తొక్కిసిలాటే జరిగిందట. కానీ ఎలాగోలా టికెట్ పట్టేసి ఈ సినిమాను చిరంజీవి, నాగబాబు చూసేశారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే చిరంజీవి తండ్రి కూడా ఆ థియేటర్‌కు వచ్చారట. అయితే చిరంజీవి, నాగబాబుని ఎక్కడ చూసారో.. ఏంటో తెలియదు కానీ.. సినిమా అయిపోయాక బయటకు రావడంతోనే అక్కడే ఉన్న కొబ్బరి మట్టను విరిగేలా చిరంజీవిని రోడ్డుపై పరిగెత్తించి మరి ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్లారట.
ఎంత పెద్ద స్టార్ హీరోని అలా రోడ్డుపై కొట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే అప్పటికి చిరంజీవి ఏజ్ కేవలం 13 ఏళ్ళే. ఇక ఆ టైంలో నాగబాబు వయసెంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత చిన్న పిల్లాడిని వెంటపెట్టుకొని నువ్వు సినిమా చూడడానికి మొదటి రోజు ఇంత రష్లో వచ్చేసావా.. ఈ జనాల్లో మీ ఇద్దరికీ ఏమైనా జరిగి ఉంటే ఏం చేసేవాడివి అంటూ కోపంతో కొబ్బరిమట్ట విరిగేలా కొట్టేసారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు ఇప్పటికీ రాము సినిమా గుర్తుకు వస్తే చిరంజీవికి, నాగబాబు కు ఒంట్లో వణుకు పడుతుందని వివరించాడు. ఇక ప్రస్తుతం మెగస్టార్ బర్త్‌డే భాగంగా ఈ న్యూస్ నెటింట మరోసారి ట్రెండింగ్‌గా మారింది.