పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాలలో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “కూడా ఒకటి. పవన్ ఏపీ రాజకీయాలపై గత ఆరేడు నెలలుగా బాగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తోన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడింది.
ఇక ఇప్పుడు పవన్ సినిమాలు తిరిగి సెట్స్ మీదకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా హరిహర వీరమల్లు సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వీరమల్లులో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రోజు నిధి పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నిధి అయితే స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది అని చెప్పాలి.
తన డ్రెస్ గాని లేదా ఆమె ధరించిన ఆభరణాలు కానీ ఆమెకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పంచమి పాత్రలో వీరమల్లు ప్రియురాలిగా కనిపించనుంది. ఇక మేకర్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. అలాగే నిన్ననే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలు కాగా పవన్ సినిమా సెట్స్ త్వరలోనే జాయిన్ కానున్నారు.