టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని, అభిమానులని బాగా అలరించాయి.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ కు కూడా సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అయ్యింది. ఇక ఈ రికార్డ్‌ను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో షేర్ చేస్తున్నారు.
కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధా ఆర్ట్స్ బ్యానర్ లపై దేవర తెరకెక్కుతోంది. తాజాగా దేవరలో విలన్ రోల్ చేస్తోన్న సైఫ్ ఆలీఖాన్ భైరవ గ్లింప్స్ కూడా అదిరిపోయిన సంగతి తెలిసిందే.