గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ సినిమాలో మొదట హీరో, హీరోయిన్ ఛాన్స్ మరో ఇద్దరు స్టార్ సెలబ్రెటీస్‌కు వచ్చిందట.

Allu Arjun: హాలీవుడ్‌కు అల్లు అర్జున్‌.. బన్నీని కలిసిన దర్శకుడు |  allu-arjun-offered-a-hollywood-film-by-big-director

అయితే ఆ ఇద్దరు ఎవరు.. ఎందుకు ఆ సినిమాను రిజెక్ట్ చేశారు.. ఒకసారి తెలుసుకుందాం. గీత గోవింద మూవీ లో విజయ్ దేవరకొండ పాత్ర కోసం ముందు దర్శకుడు పరిశురామ్‌ అల్లు అర్జున్‌ను హీరోగా భావించారట. అయితే బన్నీ అస‌లు ఈ సినిమాలో నటించడానికి ఆసక్తే చూపు లేదట. అలాగే సినిమాలో రష్మిక మందన కంటే ముందు హీరోయిన్ లావణ్య త్రిపాఠిన భావించారని.. కథ మొత్తం విన్న లావణ్య త్రిపాఠి.. విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్ కారణంగా ఆ సినిమాను రిజెక్ట్ చేసిందని టాక్‌. లావణ్య త్రిపాఠి లిప్ లాక్ సీన్స్ దూరంగా ఉండాలని ఉద్దేశంతోనే ఆ సినిమాను వదులుకుందట‌.

Actress Lavanya Tripathi Exudes Elegance In Muted Mauve Printed Saree -  News18

ఈ క్రమంలో రష్మిక మందన అవకాశాన్ని సంపాదించడం.. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో పాటు వీరి నటనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు వీరిద్దరూ ఈ సినిమా తర్వాత నుంచి పర్సనల్ లైఫ్ లోను మంచి బాండింగ్ తో ఉన్నారని.. ఇద్దరు డేటింగ్ లో ఉంటున్నారు అంటూ.. వీరిద్దరూ లవర్స్ అంటూ ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో మళ్ళీ ఆ రేంజ్‌ హిట్ ప‌డ‌లేదు. ఇక రష్మికకు ఈ సినిమా తర్వాత వ‌రుస‌ ఆఫర్స్ వచ్చిపడ్డాయి. అలా గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక.. ఇక వెనక తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.