టాలీవుడ్ సినిమాను తలెత్తుకుని చూసే రేంజ్‌కు తీసుకువెళ్లిన సినిమా ఏది అంటే టక్కున గుర్తుకొచ్చేది బాహుబలి. ఈ సినిమా విజన్. స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కూడా సినిమా సక్సెస్‌కు కారణమైన సంగతి తెలిసిందే. ఇక దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు. ప్రభిస్, అనుష్క, తమన్న, రానా ఇలా ఎంతోమంది ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో.. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ సెకెండ్ ఇన్నంగ్స్‌కు ఇదే బలమైన బీజం.
అయితే మొదట ఈ క్యారెక్టర్ కోసం రమ్యకృష్ణని అనుకోలేదట జక్కన్న. అతిలోకసుందరి శ్రీదేవి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. ఆమెను తీసుకోవాలని.. రాజమౌళి భావించాడట. శ్రీదేవి వల్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మార్కెట్ పెరుగుతుందని ఉద్దేశంతో ఆయన శ్రీదేవిని తీసుకోవాలని భావించాడట. ఈ పాత్ర కోసం ఆమెను అప్రోచ్ కామని నిర్మాతలకు చెప్పగా.. ఎనిమిది కోట్లు డిమాండ్ చేసిందని.. తన ఖర్చులను కూడా భరించాలని చెప్పేసిందని.. ఈ విషయాన్ని నిర్మాతలు రాజమౌళికి చెప్పడంతో.. వామ్మో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశ్యంతో శ్రీదేవిని పక్కనపెట్టి రమ్యకృష్ణను తీసుకున్నామని స్వయంగా రాజమౌళి ఇంటర్వ్యూలో వివరించాడు.
ఇక ఈ మాటలు విన్న శ్రీదేవి తర్వాత రాజమౌళి కామెంట్స్ పై రిప్లై ఇచ్చిందట.. అన్ని డబ్బులు నేను అసలు అడగలేదని.. నిర్మాతలు రాజమౌళికి అబద్ధం చెప్పి ఉంటారనట్లు ఆమె రియాక్ట్ అయిందట. డబ్బుల కోసమే నటించేదాన్ని అయితే 300 సినిమాలు నటించగలనా అంటూ లాజికల్ గా రిప్లై ఇచ్చిందట. ఇక బాహుబలి సినిమాకి శోబూ యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నిజమెంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో నెటిజన్స్.. ఒకవేళ రాజమౌళి అనుకున్నట్టు శ్రీదేవిని తీసుకొని ఉంటే శివగామి పాత్రకు ఆమె అంతగా సూట్ అయ్యేది కాదని.. కేవలం రమ్యకృష్ణకు మాత్రమే అది పర్ఫెక్ట్ గా ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.