దేవ‌ర ‘ ఎన్టీఆర్ పాత్ర‌పై ఫ్యీజులు ఎగిరి.. మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మరో ఐదు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పార్ట్‌లు కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటుంది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో బజ్‌ ఇంకా పెరగటం లేదు. తాజాగా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది చెప్పటం మాత్రమే కాదు.. సినిమా లుక్ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.

NTR - Devara: అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.! -  Telugu News | Fans waiting for NTR's Devara Movie Update on June 30 Telugu  Heroes Photos | TV9 Telugu

సైఫ్ అలీఖాన్ లుక్ కోసం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో సినిమా టోన్.. సినిమా లెవెల్ ఎలా ఉండబోతుంది అన్నది చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది. దేవర భారీ సినిమా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ భారీతనం తెరమీద ఎలా ఉండబోతుందో.. చిన్న శాంపిల్ చూపించాడు దర్శకుడు కొరటాల. ఈ గ్లింప్స్‌కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన కంటెంట్‌లో ఈ టోన్ భారీతనం అయితే లేదు. సినిమాలోని హీరో విలన్ పాత్రలు ఇప్పటికే బయటికి వచ్చాయి.

Devara | దేవర షూటింగ్‌ అప్‌డేట్.. తారక్‌ టీం ఇంతకీ ఎక్కడుందో  తెలుసా..?-Namasthe Telangana

సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అనే టాక్ ఉంది. అదే పెద్ద సస్పెన్స్ అంటున్నారు. అందువల్ల ఇప్పటివరకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ కాకుండా మరో లుక్కు కూడా ఉంటుంది అనుకోవాలి. అయితే ఆ లుక్ సినిమా రిలీజ్‌కి ముందే బయటకు రిలీజ్ చేస్తారా.. లేదా.. సినిమాలోని ఆ లుక్ ని చూడాల్సి ఉంటుందా.. అన్నది చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు, కొరటాల‌ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ కి జోడిగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వీకపూర్ నటిస్తోంది. ఆమెకు తెలుగులో ఇదే తొలి సినిమా కావటం విశేషం.