నందమూరి ఫ్యామిలీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు నటసార్వభౌమ తారక రామారావు గారు. ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించుకుంటూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే కొంతమంది సినీ ఇండస్ట్రీలో, కొంతమంది రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన నట వారసత్వంతో పాటు, రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకొని సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నాడు. అలాంటి బాలయ్యను ఓ హీరో ఉరికించి మరీ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాలయ్య ఫ్యామిలీ మొదటినుంచి చాలా పెద్ద కుటుంబం అన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య అక్కలు, తమ్ముళ్లు హైదరాబాద్‌లో తనతో పాటు పెరిగారు.
అన్నయ్యలు మాత్రం సొంతూరులో పల్లెటూరి వాతావరణంలో తాతయ్య దగ్గర పెరిగారట. అలా తాతయ్య దగ్గర పెరిగిన వారిలో సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా రాణించిన జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా ఒకడు. హరికృష్ణ వ్యవసాయ పనులను చూసుకుంటూ తన తాతయ్యతో పాటు మొదట్లో ఊర్లోనే లైఫ్ లీడ్ చేసేవాడట. తర్వాత తండ్రి రాజకీయ పార్టీ పెట్టడం.. తండ్రి వెంటే ఉంటూ పార్టీని నడిపిస్తూ పార్టీ పనులను కూడా చూసుకుంటూ వచ్చాడు. అలా హరికృష్ణ చిన్నతనం నుంచి ఎంతో గంభీరంగా ఉంటారు. అలాగే ఆయన మొహంలో ఆ దర్జా కనపడుతుందట. అలా ఆయనను చూస్తే చాలామంది భయపడేవారట. ఆయన మాటకు గౌరవించే వారట. ఇక చివరకు ఎన్టీఆర్ కూడా హరికృష్ణ గట్టిగా మాట్లాడితే ఆయన మాట వినేవాడట.
అలాంటి హరికృష్ణ తన తాతయ్యతో కలిసి పొలం పనులు చేస్తున్న క్రమంలో.. బాలకృష్ణా పొలం దగ్గరకు వచ్చి తన స్నేహితులతో ఆ పొలాలన్నీ నావే అంటూ స్టైల్ గా గొప్పపలు చెప్పాడట. దాంతో హరికృష్ణ కోపం వచ్చిందని.. కట్టే పట్టుకుని బాలకృష్ణను ఇంటి వరకు పరిగెతిచ్చి మరీ కొట్టారట. స్టైల్ గా నా పొలం అని చెబుతున్నావ్.. ఏ రోజైనా పొలంలో కష్టపడి పనిచేశావా..? కనీసం నారు వేసావా..? పోనీ పంట పండించావా..? ఎలా చెబుతున్నావ్ అంటూ బాలకృష్ణను తన్నాడట. దీంతో హరికృష్ణకు తాతయ్య కూడా సపోర్ట్ చేశాడని.. అలా బాలకృష్ణ చిన్నతనంలోనే అన్నతో దెబ్బలు తిన్నాడని వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలను స్వయంగా బాలయ్య ఓ సందర్భంలో వివరించాడు. ఆయన కొట్టడం నిజంగా నా మంచి కోసమే జరిగింది.. చాలా అహంకారంతో నా పొలమని చెప్పా.. ఆ పొలంలో అన్నయ్య, పనివాళ్ళు కష్టపడి పనిచేశారు. ఆ పంటను నేను తిన్నా.. కానీ కష్టపడకుండా ఇది నా పొలం అని చెప్పడంతో అన్నయ్యకు కోపం వచ్చి నన్ను కొట్టారు అంటూ వివరించాడట.