బాలీవుడ్ యాక్టర్ సిద్ధాంత్ కర్నిక్ ఈ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ గతేడాది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కిన యానిమల్ సినిమా నటుడు అంటే టక్కున గుర్తుకు వస్తుంది. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ.900 కోట్ల గ్రాస్ వసూళను కల్లగొట్టి.. రికార్డులు సృష్టించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు సిద్ధాంత్ కర్ణిక్. అంతే కాదు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలోను మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధాంత్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. క్యాస్టింగ్ కౌచ్ పై ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సిద్ధాంత్ మాట్లాడుతూ.. తను ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. 22 ఏళ్ళ వయసులో నేను నా కెరీర్ ప్రారంభించానని.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశానని చెప్పుకొచ్చాడు. అతను నా పోర్ట్ఫోలియో తీసుకొని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మని పిలిచాడని.. ఆ టైంలో పిలవడం నాకు కాస్త విచిత్రంగా అనిపించినా అవకాశం కోసం తప్పక వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం కో ఆర్డినేటర్ మాట్లాడుతూ.. అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు.. లేదంటే నీకు ఫ్యూచర్ ఉండదని బెదిరించారని.. దాంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించాను అంటూ వివరించాడు.
ఆ టైంలో అతను నాకు చాలా దగ్గరగా వస్తూ మాట్లాడడం మొదలు పెట్టాడని.. వెంటనే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకు వచ్చేసా అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్న సిద్ధాంత్.. తర్వాత నా సినిమా అవకాశాలను తను దెబ్బతీస్తాడేమోనని ఎంతో భయపడినట్లు చెప్పుకొచ్చాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను ప్రశంసించాడు అని కామెంట్స్ చేశాడు. 2004లో టీవీ షో రీమిక్స్ తో కర్ణిక్ తన కెరీర్‌ను ఆరంభించి ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీగా పాన్ ఇండియా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.