కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ గురించి టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ బస్ కండక్టర్గా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగాడు రజిని. ఇప్పటికి రజనీకాంత్ స్టైల్, ఆటిట్యూడ్, మేనరిజం ట్రెండింగ్ గా ఉంటూనే ఉంది. అపూర్వ రా గంగల్ సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రజిని.. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. కమల్ హాసన్ తో కలిసి విలన్ పాత్రలోను ఆకట్టుకున్నాడు. 1978లో కమ్మలతో పాటు పలు సినిమాల్లో నటించిన రజనీకాంత్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన భైరవితో సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకొని హీరోగా మారాడు.
వాకింగ్ స్టైల్ నుంచి యాక్టింగ్ వరకు రజిని ఎంతో స్పెషల్గా కనిపిస్తూ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తాడు. ఆయన స్పీచ్ నుంచి చేసే ప్రతి పనిలోనూ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రజనీకాంత్. అయితే రజనీకాంత్ ఒక తెరిచిన పుస్తకం లాంటి వారు. మనసు ప్రశాంతంగా ఉండడానికి.. ఏకాంతంగా ఉండడానికి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఎప్పటికప్పుడు హిమాలయాలకు వెళ్లి వస్తూ ఉంటాడు రజిని. ఈ క్రమంలో తాజాగా రజనీకాంత్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. రజినీకాంత్ సాధారణంగానే బొటనవేలు, చూపుడువేలు కలిపి ముద్ర వేస్తూ కనిపిస్తూ ఉంటాడు.
నార్మల్ గా కాకుండా సినిమాల్లోను ఈ ముద్ర తో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూస్తున్న ఈ పై ఫోటోలోనూ రజినీకాంత్ ఈ ముద్ర వేసి ఉన్నారు. అయితే ఈ ముద్ర అర్ధం ఏంటి.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ ముద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. యోగా నిపుణులు చెప్తున్నారు. రజిని అనుసరించే ఈ చేతి ముద్రను చిన్ ముద్ర అంటారు. ఈ ముద్ర వల్ల మెదడు నరాలు మెరుగ్గా పనిచేస్తాయని. జ్ఞాపకశక్తి మెరుగవుతుందని.. ఒత్తిడిని తగ్గిస్తుందని.. యోగా నిపుణులు చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత కలగడంతో పాటు.. నిద్రలేమి, తలనొప్పి సమస్యలు కూడా తగ్గుతాయట. ఈ ముద్రను తరచూ వేస్తూ ఉండడం వల్ల నరాలు ప్రశాంతంగా మారుతాయని.. మన దృష్టి మరలకుండా చేస్తాయని.. అందుకే ఈ ముద్ర యోగ చేస్తున్న సమయంలో ఎక్కువగా అనుసరిస్తారని యోగ నిపుణులు చెప్తున్నారు. రజిని కూడా రోజు ఈ ముద్రను వేస్తూనే ఉంటారట. అయితే ప్రస్తుతం ఈ ముద్రకు సంబంధించిన ప్రయోజనాలు నెటింట వైరల్ అవ్వడంతో ఆయన రోజు చేసే ఈ చిన్న ముద్ర లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.