సినీ ఇండస్ట్రీలో నటినట్లుగా రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కొందరికి స్టార్ నటులుగా గుర్తింపు వస్తుంది. నటనపై ఆసక్తితో ఎంతో మంది ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాదు. ఇక గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారైతే మరింత శ్రమించాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు. సినిమాలు, సీరియల్స్ అంటూ వెండి తెర, బుల్లితెరను ఏలుతున్న ఎంతోమంది సెలబ్రిటీలే వీటికి ఉదాహరణ. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఓ బీటౌన్ యంగ్ హీరో పేరు తెగ ట్రెండ్ అవుతుంది.
అతను స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ పెళ్లిలో సర్వర్ గా పనిచేసిన అబ్బాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన గతంలో పెళ్లిళ్లలో సర్వర్గ వ్యవహరించేవాడని.. ఇప్పుడు అతనే కష్టంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాడు అంటూ తెలుస్తుంది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో ఎవరో ఒకసారి మీరు లుక్ వేసేయండి. అతను మరెవరో కాదు హీరో ఆసిఫ్ ఖాన్. ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి సక్సెస్ అందుకున్న పంచాయత్ 3 సిరీస్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు ఆసిఫ్ ఖాన్. ఈ వెబ్ సిరీస్ లో స్థానాన్ని దక్కించుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆసిఫ్.. ఒక్కసారిగా ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పంచాయతీ 3 సిరీస్ లో నటించిన ప్రతిపాత్ర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులిరా అల్లుడు పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ఆసిఫ్ ఖాన్. పులిరా అల్లుడు గణేష్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ తో పాటు మీర్జాపూర్ లాంటి ఎన్నో వెబ్ సిరీస్ లలో ఆసిఫ్ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. కానీ ఊహించిన సక్సెస్ రాలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాల తర్వాత ఇప్పుడు స్టార్‌డంను చూస్తున్నాడు. చిన్న వయసులోనే తండ్రి మరణంతో.. కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిపై పడడం.. చిన్న ఉద్యోగాల్లో చేరి కుటుంబాని పోషించాడు. ఈ క్రమంలో హోటల్లో వెయిటర్ గా పనిచేశాడు ఆసిఫ్.
ఆ విషయాన్ని తానే స్వయంగా ఇంటర్వ్యూలో వివరించాడు. నాకు కష్టమైన రోజుల్లో హోటల్లో వెయిటర్ గా పనిచేశా. అదే హోటల్లో కరీనా, సైఫ్ అలీ ఖాన్ రిసెప్షన్ కూడా జరిగిందంటూ వివరించాడు. వారిద్దరి రిసెప్షన్లో సర్వర్ గా పని చేశానని.. ఆ తర్వాత కొన్ని ఏళ్లపాటు మాల్‌లో పనిచేశానని వివరించాడు. అదే సమయంలో సినిమాల కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చానని.. జైపూర్ లోని థియేటర్ ట్రూప్‌లో చేరనని వివరించాడు. తర్వాత క్యాస్టింగ్ అసిస్టెంట్ గా మారి చిన్నచిన్న పాత్రలో అవకాశాలను దక్కించుకుని నటించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆసిఫ్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో వెయిటర్ పొజిషన్ నుంచి హీరోగా ఎదగటం అంటే నిజంగా గ్రేట్ అంటూ.. అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు స్టార్ హోదా అనుభవిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.