“అది తప్పు అంటూ ప్రూవ్ చేసిన సమంత”..దెబ్బకి అందరి నోర్లు ఖతక్..!

సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. అయితే హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి దూరంగా ఉండింది. దీంతో ఒక్కసారిగా ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి. సమంతకి మయోసైటీస్ తిరగబడింది ఆ కారణంగానే సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయలేక పోతుంది అని సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండడానికి కారణం అదే అంటూ తెగ ప్రచారం జరిగింది. కొంతమంది మయోసైటీస్ వ్యాధి పూర్తిగా ఆమెకు ఎక్కేసింది అని ..ఇక ఆమె కోలుకోలేదు అని మాట్లాడుకున్నారు.

అయితే ఆ వార్తలంతా తప్పు అంటూ ప్రూవ్ చేసింది సమంత. తాజాగా హీరోయిన్ సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె చాలా హెల్తీగా ఉంది ఆరోగ్యకరంగా కూడా ఉంది అని చెప్పే విధంగా ఆమె కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. కాగా.. స‌మంత మ‌ళ్లీ ఆశ్ర‌మం బాట ప‌ట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి.. అక్క‌డ ధ్యానం చేస్తున్న పలు ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. “మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారు. మ‌న జీవితానికి వెలుగు చూపుతూ, స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌క్తిని క‌నుగొడం అనేది చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం అని స‌మంత రాసుకొచ్చింది. అంతేకాదు..జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి.. ఎందుకంటే మ‌న రోజు వారి జీవితంలో అనేక సంఘ‌ట‌న‌లు వ‌ల్ల మ‌న‌కు ఇది ల‌భిస్తుంది. అయితే.. ఇది సుల‌భ‌మైన‌ది అని మీరు ఆలోచిస్తున్నారు. కాని కానేకాదు. దీన్ని సంపాదించుకోవ‌డం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. జ్ఞానం పొంద‌డంమే కాదు దాన్ని అమ‌లు చేయ‌డం నిజంగా ఎంతో ముఖ్య‌మైన‌ది” అంటూ స‌మంత రాసుకొచ్చింది.