స్టార్ బ్యూటీ కృతి శెట్టి, శ్రీలీల హాలీవుడ్ లో ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస ఆఫర్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఒకదాని తర్వాత ఒకటి వరుస సినిమాలను నటిస్తూ తర్వాత రోజుల్లో ప్లాపులు ఎదురవడంతో కెరీర్ లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దరి బాటలోనే మరో స్టార్ హీరోయిన్ ప్రయాణిస్తుంది. అప్పట్లో వారిద్దరికీ ఎలా వరుస ఆఫర్లు క్యూ కటయో అలాగే తాజాగా ముద్దుగుమ్మ భాగ్యశ్రీ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఒక సినిమా కూడా రిలీజ్ కాకముందే భాగ్యశ్రీ మూడో సినిమాకు సైన్ చేసి హాట్ టాపిక్ గా మారింది.
రవితేజ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్గా నటిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాతో పాటు గౌతమ్ తిననూరి కాంబోలో మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుంది ఈ అమ్మడు. అయితే తాజాగా సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ జోడిగా మరో సినిమాలో జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ టైర్ వన్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు భాగ్యశ్రీకి క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు. అయితే మీ ఈ అమ్మడు నటించే సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఆమెకు కెరీర్ పరంగా పూర్తిగా మైనస్ అయిపోతుంది.
ఇక ప్రస్తుతం భాగ్యశ్రీ రెమ్యునరేషన్ లిమిట్ గానే ఉందని తెలుస్తుంది. కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందంతోపాటు ఈ అమ్మడు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే అమ్మడు నెక్స్ట్ లెవెల్స్ కథలను ఎంచుకొని నటనతో తన సత్తా చాటాలని భావిస్తున్నారు నెటిజన్లు. అయితే సినిమాలు రిలీజ్ కాకపోయినా ఈ అమ్మడుకు సోషల్ మీడియా వేదికగా భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.