టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు భార్యభర్తలు అన్నాక అపార్థాలు సహజమని, సర్థుపోయి కలిసి ఉండాలంటూ హితవు పలుకుతున్నారు.
![Samantha Akkineni Naga Chaitanya anniversary| [INSIDE PHOTOS] Revisiting Samantha Akkineni, Naga Chaitanya's fairytale wedding on their third anniversary](https://imgk.timesnownews.com/media/22221067_1867011730276668_4412086969648021504_n.jpg)
మరోవైపు సామ్, చైతు విడాకులు సందర్భంగా.. వారి పెళ్లి ఫొటోలు తెగ ట్రెండ్ అయిపోతున్నాయి. కాగా, 2017 అక్టోబరు 6న వీరిద్దరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరు అంగ రంగ వైభవంగా ఒకటైయ్యారు. అలాగే హైదరాబాద్, చెన్నైలలో రెండు రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. వీరి వివాహ వేడుక అప్పట్లో హాట్ టాఫిక్‌గా మారింది.

![]()

![]()















