ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!

టాలీవుడ్‌లోనే కాదు ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అజేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాతో ప్రారంభ‌మైన రాజ‌మౌళి ప్ర‌స్థానం గ్యాప్ లేకుండా త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ ఇండ‌స్ట్రీ హిట్ల‌తో దూసుకు పోతోంది. రాజ‌మౌళి సినిమాలు ఎంత ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నా రాజ‌మౌళి త‌న టీం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ను త‌యారు చేసే విష‌యంలో త‌న తోటి ద‌ర్శ‌కుల‌తో పోలిస్తే చాలా వెన‌క‌ప‌డ్డారు.

SS Rajamouli explains how his version of Mahabharata will be a 10-part  film: 'That is my dream' | Telugu News - The Indian Expressమ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ విష‌యంలో రాజ‌మౌళితో పోలిస్తే చాలా ముందు.. రాజ‌మౌళికి అంద‌నంత ఎత్తులో ఉన్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తీస్తోన్న పెద్ది డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడే. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు, మృత్యుంజ‌య్ సినిమాతో ఆక‌ట్టుకున్న హుస్సేన్‌ షా కిరణ్ వీళ్లంద‌రూ సుకుమార్ క్రియేటివిటీలో రాటుదేలిన వారే. సుకుమార్ శిష్యులు ఎంతోమంది సూప‌ర్ హిట్లు కొడుతున్నా.. వాళ్లు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు ఇస్తున్నా… రాజ‌మౌళి శిష్యగణం నుండి మాత్రం ఇప్పటివరకు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ రాకపోవడం గమనార్హం.

Director Sukumar visits and donates Rs 5 Lakh to support child injured in  'Pushpa 2' event stampede | - The Times of Indiaరాజమౌళి వద్ద పనిచేసిన అశ్విన్ గంగరాజు, మ‌హ‌దేవ్ లాంటి వారు తీసిన సినిమాలు స‌క్సెస్ కాలేదు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుల్లో వెంకీ కుడుముల ‘ఛలో’, ‘భీష్మ’ వంటి హిట్లు అందించారు. ఏదేమైనా రాజ‌మౌళి వ‌ద్ద ప‌నిచేసిన ద‌ర్శ‌కులు ఆయన మేకింగ్ స్టైల్‌ను గానీ, ఆ భారీ విజన్‌ను గానీ అడాప్ట్ చేసుకుని బయటకు వస్తే టాలీవుడ్‌కు అది పెద్ద ఎసెట్ అవుతుంది. ఆయన శిష్యుల నుంచి కూడా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులు వ‌స్తే అది ఖ‌చ్చితంగా తెలుగు సినిమాను మ‌రో మెట్టు ఎక్కించిన‌ట్టు అవుతుంది.