టాలీవుడ్లోనే కాదు ఇండియన్ సినీ పరిశ్రమలోనే దర్శకధీరుడు రాజమౌళి అజేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రిందట స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన రాజమౌళి ప్రస్థానం గ్యాప్ లేకుండా త్రిబుల్ ఆర్ వరకు వరుస సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్లతో దూసుకు పోతోంది. రాజమౌళి సినిమాలు ఎంత ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నా రాజమౌళి తన టీం నుంచి కొత్త దర్శకులను తయారు చేసే విషయంలో తన తోటి దర్శకులతో పోలిస్తే చాలా వెనకపడ్డారు. […]

