ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా.. పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ తమ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. ఆడియన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం రూపొందనున్న ప్రాజెక్టులలో కేవలం అనౌన్స్మెంట్ తోనే.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్ పెట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు.
ఇక అట్లీ బాలీవుడ్‌లో జవాన్ సినిమాతో రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి బ్లాక్ బాస్టర్ కాంబోపై ఆడియన్స్‌లో అంతకంతకు ఆసక్తి పెరిగిపోయింది. ఇక వీళ్ళిద్దరి కాంబో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో తోనే ఆడియన్స్ లో హైప్ పెంచడంలో బాల్ సిక్స్ కొట్టింది. ఈ వీడియోతో సినిమా హాలీవుడ్ రేంజ్ లో విఎఫ్ఎక్స్‌తో రూపొందుతుందని ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ మేకర్స్ త్వరలోనే రివిల్ చేయనున్నారు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే నటించనుందట. తాజాగా టీం.. అఫీషియల్ గా దీనిని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. బన్నీ ఫ్యాన్స్, ఇతర సినిమాల మేకర్స్ వీళ్లను చూసి సినిమా అప్డేట్లను అందించడం నేర్చుకోవాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాల్లో కేవలం దీపిక పదుకొనే కాకుండా.. మరో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోపు ఉందంటూ టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇతర హీరోయిన్లకు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే మేకర్స్ ఆడియన్స్ కు అందించనున్నారని సమాచారం . ఇక ఇప్పటికే సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ అని తెలియడంతో అభిమానులలో మంచి ఎక్సైట్మెంట్ నెలకొంది. అలాంటిది సినిమాలో గ్లామర్ ట్రీట్ పెంచేందుకు మరో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ యాడ్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మొదట్లోనే పీక్స్ లెవెల్ కు వెళ్తాయి అనడంలో సందేహం లేదు.