పెళ్లితో ఒక్కసారిగా టాలీవుడ్ రిచెస్ట్ హీరోగా మారిన అఖిల్.. ఆస్తుల లెక్కలివే..!

అక్కినేని అఖిల్. జైనబ్‌ల వివాహం హైదరాబాద్‌లో.. నాగార్జున ఇంటి వద్ద అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిన్న ఉదయం 3:30 గంటలకు కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది సెలబ్రిటీల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నారు. కాగా.. పెళ్లి.. రిసెప్షన్ను మాత్రం జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖ, సెలబ్రిటీతో పాటు రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ మాన్స్‌ ఇలా ఎంతోమంది తరలిరానున్నారట. అయితే.. పెళ్లి సింపుల్గా చేసిన రిసెప్షన్ మాత్రం లెవెల్ లో ఉండనుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అఖిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. వివాహం తర్వాత.. అఖిల్ ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోగా మారిపోయాడు అంటూ.. ఆస్తులు అమాంతం పెరిగిపోయినట్లు టాక్ నడుస్తుంది.

Nagarjuna's son Akhil Akkineni marries longtime girlfriend Zainab Ravdjee;  See first pics of newlyweds - Know more about the BRIDE | - Times of India

కారణం.. జైనబ్‌ ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్. ఆ కుటుంబానికి విదేశాల్లో సైతం పెద్దపెద్ద బిజినెస్‌లు ఉన్న సంగతి తెలిసిందే. అలా టాప్ బిజినెస్ మ్యాన్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జుల్ఫీ రావిగ్జ్‌.. ఒక్కగానొక్క కూతురును అఖిల్ వివాహం చేసుకున్నాడు. ఇక జైనబ్‌కు సోదరుడు ఉన్న.. ఇద్దరికీ అస్తులు సమానంగా వస్తాయి. అలా.. చూసుకున్నా వేల కోట్లది ఆస్తులకు అఖిల్ అధిపతి కానున్నాడు. ఇక ఇప్పటికే జైనబ్‌ పేరిట.. తండ్రి తరఫున కోట్లల్లో ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక జైన‌బ్‌ తండ్రి.. బిజినెస్ మాన్ అయినా.. తన తండ్రి బాటలో కాకుండా సొంత మార్గాన్ని ఎంచుకొని పెయింటర్గా, యాక్ట్రెస్ గా రాణిస్తుంది. ప‌లురంగాల్లో సత్తా చాటుకుంటూ కోట్లల్లో ఆస్తులు కూడబెడుతుంది.

Akhil Akkineni ties the knot with Zainab Ravdjee | Telugu Cinema

అయితే.. తాజాగా అఖిల్‌ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ఇచ్చిన ఆస్తులతో పాటు.. తన ఆస్తులను కూడా కూడగట్టుకుని.. అఖిల్ ఒక్కసారిగా టాలీవుడ్ రిచెస్ట్ హీరోను చేసేసిందట. నాగార్జునకు ఇప్పటికే వేలకోట్ల ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. వేల‌ ఎకరాల భూములతో పాటు.. అన్నపూర్ణ స్టూడియోస్తో వచ్చే ఆదాయం గణనీయంగా ఉంటుంది. అలాగే పలు బిజినెస్ లు కూడా ఉన్న నేపథ్యంలో.. నాగార్జున ఆస్తులు.. ఇద్దరు కొడుకులకు సమానంగా దక్కుతుంది అంటూ.. నాగార్జునకు ఉన్న రూ.2000 కోట్ల ఆస్తుల్లో అఖిల్ కు దాదాపు రూ.1000 కోట్ల ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఇక అమల పుట్టింటి నుంచి కూడా కొన్ని ఆస్తులు అఖిల్‌కే దక్కుతాయి. అటూ జైన‌బ్‌ నుంచి కూడా అఖిల్ ఆస్తులు పెరిగాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనే ఉన్న యంగ్ రిచెస్ట్ హీరోల్లో.. అఖిల్ మొట్టమొదటి ప్లేస్ లో ఉండడంతో.. సోషల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.