అఖండ 2తో బాలయ్య బీభత్సవం.. ఆ ఒక్క క్లారిటీ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో గాడ్ ఆఫ్ మాసెస్‌.. నందమూరి బాలయ్య నటిస్తున్న అఖండ 2 సినిమా ఒకటి. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బాల‌య్య వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న‌ క్రమంలోనే.. కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది అఖండ. ఈ సినిమాకు సిక్కుల్ గా అఖండ 2 రూపొందుతుంది.ఈ క్రమంలోనే బోయపాటి సినిమాని ఆడియన్స్ అంచనాలను మించిపోయారు రేంజ్ లో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది.

Akhanda 2' update: Team to commence filming soon

ఈ క్రమంలోనే అఖండకు సంబంధించిన ఒకే ఒక్క క్రేజీ అప్డేట్ వస్తే బాగుంటుందని ఆ అభిమానులంతా ఆరాటపడుతున్నారు. మరో రెండు రోజుల్లో(జూన్ 10)న‌ బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలోనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఓ మాస్ ట్రీట్ రానుంద‌ని.. టీజర్ రిలీజ్ చేయ‌నున్నారంటూ బ‌జ్ తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. ఈ టీజర్ కోసం అభిమానులంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బర్త్డే రోజున సాలిడ్ టీజ‌ర్‌ రిలీజ్ చేస్తున్నారా.. లేదా అనే దానిపై మూవీ టీమ్ ఇచ్చే క్లారిటీ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఉందా.. లేదా.. ఈ రెండు రోజుల్లోనే తేలిపోతుంది.

Akhanda 2 : 'అఖండ 2' వర్క్ మొదలైంది.. లీక్ చేసిన అఖండ కాస్ట్యూమ్ డిజైనర్..  | Boyapati srinu balakrishna akhanda 2 works started costume designer raamz  leaked news-10TV Telugu

చాలా వరకు నేడు ఈ సినిమా టీజర్ అప్డేట్ మేకర్స్ ఆడియన్స్‌తో పంచుకునే అవకాశం ఉంది. సాలిడ్ అప్డేట్‌ కోసం.. చాలా ఎక్సైటెడ్ గా వేచి చూస్తుంటారు. అంతే కాదు.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా.. దసరా బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్‌ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. బాల‌య్య బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసే టీజర్ లో మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నారో వేచి చూడాలి.