టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ ప్రాజెక్టులలో బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్.. ఓజి సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 మూవీ టీజర్ తాజాగా రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు ట్రోల్స్ ఎదురైనా సినిమా మంచి వ్యూస్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అఖండ 2 నిలుస్తుంది అని.. రూ.200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం క్రియేట్ చేస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ అభిమానులు సైతం ఓజీ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ 2 కోసం నందమూరి అభిమానులు, ఓజి సినిమా కోసం మెగా అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
కానీ పలు సర్వేల ప్రకారం ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకే బజ్ ఎక్కువగా ఉంది. హిట్ సినిమాకు సీక్వల్ కావడంతో.. ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అస్సలు అండ్రెస్టిమేట్ చేయలేము. ఈ నేపథ్యంలోనే అఖండ 2 వర్సెస్ ఓజి బాక్సాఫీస్ వార్ నిజమైతే సంచలనాలు క్రియేట్ అవుతాయి. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని టాక్. మొదట ఆఖండ 2 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.. అంతేకాదు తాజాగా రిలీజ్ అయిన టీజర్ లోను సెప్టెంబర్ 25న ఈ సినిమా రాబోతుందని క్లారిటీ ఇచ్చేశారు.
ఈ క్రమంలోనే ఓజి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లకు సంబంధించి ఎప్పటికప్పుడు గందరగోళం నెలకొంటూనే ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు చెప్పిన డేట్ కు రిలీజ్ అవ్వడం అంటే అది నిజంగా గ్రేట్ టాస్క్. హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే ఏకంగా డజనుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే సినిమాలు వాయిదాల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కాగా పవన్ సినిమాలకు మాత్రమే రిలీజ్ డేట్ లో ఇంత కన్ఫ్యూషన్ నెలకొంటుందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజై హిట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సంచలనాలు క్రియేట్ అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.