కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ లో.. కాస్ట్టీ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి, దానికి తగ్గట్టుగా సినిమా బిజినెస్ పనులు కూడా వేగంగా పూర్తి చేసుకుంటుంది. కాగా.. ప్రస్తుతం సినిమాకు షాకింగ్ రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం.
ఇక శేఖర్ కమ్ముల సినిమాలంటేనే ఆల్మోస్ట్ హైయెస్ట్ రన్‌టైం ఉంటుంది. అలాంటిది కుబేరకు మరింత ఎక్కువ రెన్‌టైం పెంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నడివితో తెరకెక్కనుందట. అయితే ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్లు వచ్చిన చాలా సినిమాలు ఇటీవల కాలంలో ఆడియన్స్‌ను థియేటర్లలో ఎంగేజ్ చేసి మంచి సక్సెస్లో అందుకుంటున్నాయి. ఇక కుబేర సినిమాకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో.. లేదో.. చూడాలి.
వాస్తవానికి ఇది పెద్ద సవాల్ అని చెప్పాలి. ఇంతసేపు.. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్ నడుస్తుంది. ధనుష్ నటనతో కచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొంచెం తేడా కొట్టిన సినిమాకు భారీ ఎఫెక్ట్ అవుతుంది. ఇక మేకర్స్ అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకున్నారో.. లేదో.. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.