టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా.. చివరిగా ఎన్టీఆర్ నుంచి తెరకెక్కిన దేవర బ్లాక్ పాస్టర్ గా నిలిచింది. ఇక తారక్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ,తారక్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. ఇక సినిమా స్పై ఏజెంట్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పటికే షూట్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి సినిమాకు సంబంధించిన రోజుకో వార్తను ఎట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొంది. ఇప్పటికే 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా మేకర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుందని.. థాయిలాండ్, మయన్మార్, లూయిస్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని.. మూడు దేశాల్లో ఉండే డ్రగ్స్.. మాఫియా బ్యాక్ డ్రాప్లో సినిమా రూపొందుతుందని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఏదేమైన సరికొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తారక్.. ఎలాంటి క్రేజ్ అందుకుంటాడో.. నీల్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో.. లేదో.. వేచి చూడాలి.