టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఇక సినిమాలో మొదట హీరోయిన్గా మృణాల్ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. వీళ్ళలో ఎవర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి నేపద్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు.. దీపిక పదుకొనే అట. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. నార్త్‌లో క్రేజీ ప్రాజెక్టులకు సై అంటుంది. పాన్ ఇండియన్ కమర్షియల్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గతేడాది ప్రభాస్‌తో కల్కీ 2898 ఏడీ సినిమా చేసి అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక.. ఈసారి ప్రభాస్ తో ఫుల్ లెన్త్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది.
ఇక అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం దీపికా ఏకంగా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. మేకర్స్ సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఈ మ్యాటర్‌లో అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా గతంలో.. ఒక్క సినిమాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిన దీపిక.. స్పిరిట్ కోసం ఏకంగా రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్న క్రమంలో ప్రభాస్ సరసన దీపిక అనే టాక్ రావడం మూవీపై మరింత హైప్ పెంచేస్తుంది.