టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఇలాంటి క్రమంలో వెంకటేష్ ఓ సమస్యతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే సినిమాలకు దూరం అవ్వబోతున్నారంటూ వార్తల వినిపిస్తున్నాయి. ఇంతకీ వెంకటేష్‌కి వచ్చినా సమస్య ఏమై ఉంటుంది.. ఏ నొప్పితో అంతగా టార్చర్ అనుభవిస్తున్నాడు.. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తన నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ అందించలేదు.
అయితే వెంకటేష్.. ప్రస్తుతం సినిమాలు కమిట్ అవ్వక పోవడానికి కారణం ఆయనకు వచ్చిన ఓ సమస్య అట. ఆయన ప్రస్తుతం తీవ్రమైన మోకాలి నొప్పితో సతమతమవుతున్నాడట. ఈ క్రమంలోనే అసలు షూటింగ్‌లో పాల్గొనలేనని.. కాస్త దీర్ఘకాలిక రెస్ట్ తర్వాత సినిమాలకు ఓకే చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే హాస్పిటల్ లో మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేయించుకున్న వెంకీకి.. కొద్దికాలం రెస్ట్ అవసరమని సినిమాల్లో డ్యాన్సులు, స్టంట్లు అంటూ చేస్తూ కూర్చుంటే నొప్పి తీవ్రమై సర్జరీ వరకు దారి తీసే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించారట.
దీంతో అంత రిస్క్ ఎందుకులే అని.. వెంకీ కూడా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ కొత్త సినిమాలు వేటికి సైన్ చేయడం లేదని.. ఇంట్రెస్టింగ్ కథలను వినే పనిలో పడ్డారని.. తన మోకాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయి అనారోగ్య సమస్య నుంచి బయటపడిన తర్వాత.. సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలు పూర్తిగా ఇంటికి పరిమితం అవుతున్నాడట వెంకీ మామ. మే లేదా జూన్ నెలలో తన కొత్త సినిమాలు అనౌన్స్ చేసి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదుగానీ.. ప్రస్తుతం వెంకటేష్ కి సంబంధించిన వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి.