టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్.. తర్వాత వరుస సినిమాలో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇక.. ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఈ రౌడీ హీరో తాజాగా ట్రాక్ మార్చినట్లు తెలుస్తుంది. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. వరుస టాలెంటెడ్ డైరెక్టర్లను లైన్‌లో పెట్టుకుంటూ.. తన లైనప్ ను పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ ఫేమ్ గౌతం తిననూరి డైరెక్షన్లో భారీ పాన్ ఇండియన్ మూవీ నటిస్తున్నాడు విజయ్.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌ను ఈ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌కు మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మరింత హైలెట్గా నిలిచింది. ఈ క్రమంలోనే టీజర్ ఇప్పటికీ నెటింట అదిరిపోయే వ్యూస్ తో రాణిస్తుంది. ఇక పాన్ ఇండియన్ వైడ్‌గా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా మెరువగా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ సెలెక్ట్ చేసుకోవడంపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి. విజయ్ మాట్లాడుతూ తారక్ అన్నతో వాయిస్ ఇప్పించాలని ముందే ఫిక్స్ అయిపోయాం. ఆయన తప్ప అలాంటి డైలాగులకు ఎవరు న్యాయం చేయలేరు అంటూ వివరించాడు. డైరెక్టర్ లేకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు తారక్ అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు.. నేను చాలు అనేంతవరకు డబ్బింగ్ చెప్పారని.. నాకు ఆ మూమెంట్స్ చాలా స్పెషల్ అనిపించాయని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. తారక్ అన్న వాయిస్ మా సినిమాకు మరింత హైప్‌ని తెచ్చి పెట్టిందని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.