భర్తతో గొడవపడి ఇండియాకు వచ్చేసిన రంభ.. విడాకులపై సెన్సేషనల్ కామెంట్స్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమై.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. ఇలాంటి క్రమంలో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న రంభ.. కన్నడకు చెందిన బిజినెస్ మాన్‌ని వివాహం చేసుకొని.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి విదేశాల్లో సెటిల్ అయిపోయింది. చాలా రోజులు భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన‌ ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రీ ఎంట్రీకి సిద్ధ‌మైంది.

ఈ నేప‌ధ్యంలోనే ఇండియాకు వచ్చిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అలాగే బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించడం చేస్తూ ఉంది. కాగా రంభ విడాకుల వార్తలు కూడా గత కొంతకాలంగా టాలీవుడ్ మీడియాను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని.. భర్తతో గొడవలు పడి ఇండియాకు వచ్చేసింది అంటూ రూమర్లు వైరల్ గా మారాయి. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్న టైంలో ఓ హీరో, డైరెక్టర్ ఇద్దరు వారి మధ్య సయోధ్య కుదీర్చారట. మళ్లీ ఇద్దరిని కలిపారని టాక్‌.

Celebrity Couple - Actress #Ramba family ❤️ | Facebook

అయితే విడాకుల వార్తలపై తాజాగా ఓ టీవీ షోలో రంభ‌ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నాకు నా భర్తతో ఓసారి చిన్న గొడవ జరిగింది. ఆ చిన్న గొడవకే నేను పెద్ద రచ్చ రచ్చ చేసేసి.. నా బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుని నా భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేసా. కెనడా నుంచి ఫ్లైట్ ఎక్కి చెన్నైకి వచ్చేసా. ఫ్లైట్ ఎక్కే ముందే నా ఫ్యామిలీకి జరిగిన గొడవ అంత చెప్పా. ఆ టైంలో మా ఫ్యామిలీ ఎంతగానో టెన్షన్ పడ్డారు. కెనడ నుంచి చెన్నైకి వచ్చే ఫ్యామిలీతో కలిసిపోయా. తర్వాత మా మధ్య ఉన్న వివేదలు తొలగిపోవడంతో.. నా భర్త, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయా. అయితే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామన్. కానీ.. వీటిని విడాకులు తీసుకునేంతవరకు ఎప్పుడు వెళ్ళనివ్వలేదు. మేం విడాకులు తీసుకోలేదు.. కలిసే ఉన్నామంటూ రంభ వివరించింది. ఇక రంభ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆమె విడాకులపై క్లారిటీ వచ్చేసింది.