పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్‌గా చరణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు చరణ్. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత.. ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నారు టీం. ఇక ఈ ఫస్ట్ లుక్ లో చరణ్ మేకవర్‌కు అభిమానులతో పాటు సాదరణ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే చరణ్‌ను సినిమాలో సరికొత్త కోణంలో చూడబోతున్నామని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. ఈ టీజర్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ చేస్తారని అంతా భావించారు. రీ రికార్డింగ్ వర్క్ పెండింగ్లో ఉండడం వల్ల ఈ గ్లింప్స్ రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ గ్లింప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉగాదికి అంటే మార్చి 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట టీం. ఒకవేళ ఇది మిస్ అయితే.. కచ్చితంగా శ్రీరామనవమికి అయినా గ్లింప్స్ దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. టీజర్ల రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పే 4 పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోతాయని.. రంగస్థలం చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడిన చరణ్ ఎలాంటి డైలాగ్స్ చెప్పిన అది హైలెట్గా మారింది.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పబోయే డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అని ఆసక్తి అభిమానులు మొదలైంది. రీసెంట్గా ఉత్తరాంధ్ర యాసలో నాగచైతన్య ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నటన సహజత్వంగా ఉండడంతో ఆడియన్స్ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు చరణ్ కూడా అదే యాసలో మాట్లాడనున్నాడట. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ సినిమాను తండేల్‌తో పోల్చి చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉత్తరాంధ్ర యాసల సినిమాలు ఎక్కువగా వస్తున్న క్రమంలో రామ్ చరణ్ ఈ సినిమాల్లో తన యాసతో, డైలాగ్ డెలివరీతో ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. ఇకమార్చ్ 26, 2026న సినిమా రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నారు.