న‌లుగురు స్టార్ హీరోలతో అన్‌స్టాప‌బుల్ 4 క్లైమాక్స్‌.. ప్రోమో అదుర్స్‌…!

తెలుగు ఆడియన్స్ భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న టాక్ షోస్ లో నందమూరి న‌ట సింహం బాలయ్య హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఒకటి. ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా మూడు సీజన్స్ పూర్తిచేసిన ఈ షో.. నాలుగో సీజన్‌తో కూడా మంచి సక్సెస్‌ను అందుకుంటుంది. ఈ సీజన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ చివరి ఎపిసోడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పూర్తి చేశారు. అదే క్లైమాక్స్ ఎపిసోడ్ అని అంత భావించారు. కానీ.. అసలుసిసలు క్లైమాక్స్ ఎపిసోడ్ నేడు ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ట‌. ఆహ మీడియా టీం తాజాగా ఆ ప్రోమోను కూడా షేర్ చేసుకున్నారు.

Unstoppable S4 - Mass Climax Episode Promo | Balakrishna | aha videoin

ఈ సీజన్ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత ఎపిసోడ్లో అల్లు అర్జున్, నెక్స్ట్ రాంచరణ్, విక్టరీ వెంకటేష్, సూర్య ఇలా పలువురు స్టార్ హీరోస్ సందడి చేశారు. వీళ్ళు ఎపిసోడ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా దక్కింది. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ నలుగురితో కలిపి ఉండబోతుందట. అసలు ఎందుకు ఈ నలుగురు హీరోల బిట్లు పెట్టి ఫైనల్ ప్రోమో డిజైన్ చేశారు.. క్లైమాక్స్ ఎపిసోడ్ స్పెషాలిటీ ఏమై ఉంటుంది.. ఈ సీజన్లోని అన్ని ఎపిసోడ్ల హైలెట్ క్లిప్స్ కట్ చేసి ఒక ఎపిసోడ్ గ డిజైన్ చేశారా.. అనే విషయాలు తెలియాలంటే నేడు ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే.

Unstoppable 4: నలుగురు హీరోలతో 'అన్ స్టాపబుల్ 4' క్లైమాక్స్ ఎపిసోడ్..ప్రోమో  అదుర్స్! | entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ తెలుగు

ఇక‌ చిరు ఈ టాక్ షోలో రాకపోవడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశపరిచింది. బాలయ్య జనరేషన్ హీరోల్లో కేవలం వెంకటేష్ మాత్రమే ఇప్పటివరకు ఈ షో కి వచ్చారు. చిరంజీవి నెక్స్ట్ సీజన్ లో అయినా వస్తారో లేదో వేచి చూడాలి. ఇప్పటివరకు బాలయ్య ఎంతో మంది యంగ్ హీరోలతో.. ఈ షోలో హోస్ట్గా సందడి చేసిన సంగతి తెలిసిందే. అయినా.. బాలయ్య, చిరంజీవి స‌మఉజ్జీలు.. మొదటినుంచి సినిమాల విషయంలోనూ వీరిద్దరికీ గట్టి పోటీ ఏర్పడుతుంది. అంతేకాదు వీరిద్దరికి పర్సనల్గా మంచి స్నేహం కూడా ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య షోలో చిరంజీవి సందడి చేస్తే ఆ ఎపిసోడ్ మరింత హైలెట్ అవుతుందనటంలో సందేహం లేదు. ఇక ఇద్దరి సరదా చిట్ చాట్.. ఫ్యూచర్ సీజ‌న్‌లో అయినా ఉంటుందో లేదో వేచి చూడాలి.