తెలుగు టీవీ ఛానెళ్ల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న టీవీ-9 మరోసారి తన సత్తాను చాటుకుంది. టీఆర్‌పీ రేటింగ్.. విషయంలో ముందుండే.. ఈ చానెల్.. సమాజాన్ని ప్రభావితం చేసే విష యాల్లోనూ టీవీ-9 ముందుంటున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. రాష్ట్రం నుంచి జాతీయం వరకు అనేక అంశాలపై టీవీ-9 చేసిన ప్రయత్నాలు.. ప్రయోగాలు.. చేస్తున్నవి కూడా సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయనే చెప్పాలి.
ప్రస్తుతం దేశంలో నెంబర్-1 నెట్ వర్క్‌గా ఉన్న టీవీ-9.. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ.. ప్రజా నాయకుల మనోభావాలను కూడా ప్రజలకు చేరువ చేస్తోంది. ఇలాంటి వినూత్న ప్రయత్నమే తాజాగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా న్యూఢిల్లీలో నిర్వహించిన సమ్మిట్‌లో ప్రధాని అంతరంగాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. తద్వారా.. దేశానికి ప్రధాని మోడీ చేస్తున్న సేవలు.. ఆయన దేశానికి తీసుకువచ్చిన ప్రతిష్ఠను కూడా పరిచయం చేసింది.
వాస్తవానికి దేశంలో అనేక చానెళ్లు.. ఉన్నాయి. పైగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని చానెళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ పోకడలను ఎప్పటికప్పుడు పసి గట్టే.. టీవీ-9ఈ విషయంలో తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. తనకంటూ ప్రత్యేక పంథాను ఏర్పాటు చేసుకుని.. మూస విధానాలకు స్వస్తి చెప్పి.. వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారి ఓ తెలుగు ఛానెల్.. ప్రధానిని పలకరించేలా చేసింది.. టీవీ-9!
కేవలం పలకరించడమేకాదు.. భవిష్యత్తును మార్గదర్శనం చేసేలా కూడా చేసింది. గతం-వర్తమానం పు నాదులపై ఏర్పడే భవిష్యత్తును కళ్లకు కట్టినట్టు ప్రధాని నోట వినిపించేలా చేయడం గమనార్హం. అంతేకా దు.. ప్రతి విషయాన్ని కూలకషంగా వివరించేలా చేసింది. అంతర్జాతీయ మీడియాకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన.. ప్రధాని.. ఇటీవల కాలంలో జాతీయ మీడియాకు కూడా పరిమితంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ప్రాంతీయ ఛానెల్‌గా ఉన్న టీవీ-9తో చేసిన ఇచ్చిన సంభాషణ తెలుగు టీవీ చానెళ్ల హిస్టరీలోనే ఒక మైలురాయిగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.