టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన సహజ నటనతో పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు నాని. అయితే నాని కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు.. ఎంతోమంది సెలబ్రిటీస్‌కు నచ్చిన సినిమాల్లో పిల్ల జమిందార్ మూవీ ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ఇందులో నాని కామెడీ టైమింగ్స్‌తో పాటు.. ఎమోషన్స్ సైతం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో నానికి జంటగా బిందుమాధవి, హరిప్రియ హీరోయిన్లుగా మేరసారు. అయితే తర్వాత బిందుమాధవి పలు తెలుగు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇక హరిప్రియ ఈ సినిమా తర్వాత చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే నటించింది. అలా హరిప్రియ తెలుగులో తకిట తకిట, పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహ సినిమాల్లో తను నటనతో ఆకట్టుకుంది. ఈమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
సినిమాల్లోకి రాకముందు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన హరిప్రియ.. తెలుగుతో పాటు తమిళ్లోను పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పవర్ ఫుల్ విలన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వశిష్టాను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక హరిప్రియ భర్త వశిష్ట తెలుగులో నారప్ప, నయీమ్ డైరీ, ఓదెలా రైల్వే స్టేషన్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్గా ఉంటూ తనకు, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.