మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లూసిఫర్.. 2019లో తెరకెక్కి.. మలయాళ ఇండస్ట్రీలోనే మైల్డ్ స్టోన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2 ఏంపురాన్ సినిమా రూపొంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ఆయన కూడా ఓ కీలక పాత్రలో మెరిస్తాడు. అలాగే లూసీఫర్ అంటే దైవదూత అని.. ఎంపురాన్ అంటే రాజు అని అర్థమట.
ఈ క్రమంలోనే L2 ఏంపురాన్ టైటిల్ తో సినిమాను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య వచ్చి ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్‌లో కొల్లగొట్టింది. కేవలం ఇండియాలోనే రూ.22 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. మలయాళ ఇండస్ట్రీలోను ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. గతంలో ది గొట్ లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టినా.. పాన్ ఇండియా లెవెల్‌లో మాత్రం.. 8.95 కోట్లు కలెక్షన్లు మాత్రమే కొల్లగొట్టింది.
అయితే L2 ఏంపురాన్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో కలెక్షన్లతో దూసుకుపోవటమే కాదు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లోను భారీగా ఓపెనింగ్స్ కాబట్టి సంచలనం సృష్టించింది. 2019 వరకు మలయాళ ఇండస్ట్రీలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవని సమాచారం. ఇక లూసిఫర్ సినిమా మలయాళ ఇండస్ట్రీలో మొట్టమొదటి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఆట. ఆ తర్వాత మంజు మల్‌బాయ్స్.. దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు మళ్లీ L2 ఏంపురాన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రికార్డులను మాత్రం టీం ఇంకా ప్రకటించలేదు.